ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సత్యేందర్‌ జైన్‌పై సీబీఐ దర్యాప్తునకు అనుమతి

ABN, Publish Date - Mar 03 , 2024 | 05:05 AM

ఆప్‌ నాయకుడు, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్‌ జైన్‌పై విచారణ జరిపేందుకు సీబీఐకి ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వినయ్‌ కుమార్‌ సక్సేనా శనివారం అనుమతి ఇచ్చారు. జైన్‌ హోం

న్యూఢిల్లీ, మార్చి 2: ఆప్‌ నాయకుడు, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్‌ జైన్‌పై విచారణ జరిపేందుకు సీబీఐకి ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వినయ్‌ కుమార్‌ సక్సేనా శనివారం అనుమతి ఇచ్చారు. జైన్‌ హోం మంత్రిగా ఉన్నప్పుడు అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై విచారణ జరిపేందుకు ఆమోదం తెలిపారు. జైలులో ఉన్న ప్రముఖ ఖైదీలకు అక్కడ తగిన సౌకర్యాలు కల్పించేందుకు ‘ప్రొటక్షన్‌ మనీ’ కింద సొమ్ము వసూలు చేశారన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేయనుంది. జైలులో సౌకర్యవంతంగా, ప్రశాంతంగా ఉండేందుకు రూ.10 కోట్లను పలు విడతలుగా ఇచ్చానంటూ ఆర్థిక నేరగాడు సుఖేష్‌ చంద్రశేఖర్‌ ఆరోపించిన నేపథ్యంలో ఈ దర్యాప్తు జరగనుంది. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నిర్ణయాన్ని ఆప్‌ ఖండించింది. కేవలం ఒక ఆర్థిక నేరగాడు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే నిర్ణయం తీసుకోవడాన్ని తప్పు పట్టింది. ఇది చట్టాన్ని అపహాస్యం చేయడమేనని వ్యాఖ్యానించింది.

Updated Date - Mar 03 , 2024 | 05:05 AM

Advertising
Advertising