ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై వేటు

ABN, Publish Date - Mar 01 , 2024 | 04:46 AM

బడ్జెట్‌పై ఓటింగ్‌ సందర్భంగా విప్‌ను ధిక్కరించిన ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ కుల్దీ్‌పసింగ్‌ పఠానియా గురువారం అనర్హత వేటు

అనర్హులుగా ప్రకటించిన హిమాచల్‌ప్రదేశ్‌ స్పీకర్‌

పార్టీ విప్‌ ధిక్కరించినందుకే!

సిమ్లా/న్యూఢిల్లీ, ఫిబ్రవరి 29: బడ్జెట్‌పై ఓటింగ్‌ సందర్భంగా విప్‌ను ధిక్కరించిన ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ కుల్దీ్‌పసింగ్‌ పఠానియా గురువారం అనర్హత వేటు వేశారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించారు. రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడినందుకు అనర్హులుగా తేల్చలేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు రాజిందర్‌ రాణా, సుధీర్‌శర్మ, ఇందర్‌దత్‌ లఖన్‌పాల్‌, దేవిందర్‌ కుమార్‌ భుటూ, రవిఠాకూర్‌, చైతన్యశర్మలు బడ్జెట్‌పై ఓటింగ్‌లో పాల్గొనలేదని, ఆర్థిక బిల్లుపై ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయనందున అనర్హులుగా ప్ర కటించాలని స్పీకర్‌ను అధికార కాంగ్రెస్‌ కోరింది. వీరంతా మంగళవారం రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి హర్ష్‌ మహాజన్‌కు ఓటు వేయడం గమనార్హం. కాగా, విప్‌ను ఉల్లంఘించినందుకు ఎమ్మెల్యేలపై చర్యలు కోరుతూ స్పీకర్‌కు శాసనసభా వ్యవహారాల మంత్రి హర్షవర్ధన్‌ మంగళవారం పిటిషన్‌ సమర్పించారు. ఎమ్మెల్యేలు బుధవారం స్పీకర్‌ ఎదు ట హాజరయ్యారు. గురువారం ఇరుపక్షాల వాదనల అనంతరం స్పీకర్‌ నిర్ణయం ప్రకటించారు. విప్‌ను ధిక్కరించిన ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపుల నిరోధ క చట్టం పరిధిలోకి వచ్చారని.. దీంతో చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. కాగా, తమ క్లయింట్‌లకు షోకా జ్‌ మాత్రమే జారీ చేశారని, 7 రోజులకు గాను 2 రోజుల సమయమే ఇచ్చారని రెబల్‌ ఎమ్మెల్యేల తరఫు న్యాయవాది పేర్కొన్నారు. అయితే, రెబల్‌ ఎమ్మెల్యేలు హాజరు పట్టికలో సంతకం చేశారని.. బడ్జెట్‌పై ఓటింగ్‌కు గైర్హాజరయ్యారని స్పీకర్‌ పఠానియా వివరించారు.

Updated Date - Mar 01 , 2024 | 07:53 AM

Advertising
Advertising