ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Pakistan PM: వీడిన మిస్టరీ.. పాకిస్తాన్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్

ABN, Publish Date - Mar 03 , 2024 | 03:29 PM

పాకిస్తాన్ ప్రధానిగా (Pakistan Prime Minister) ఎవరు ఎంపిక అవుతారు? అనే ఉత్కంఠకు తెరపడింది. షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) వరుసగా రెండోసారి దాయాది దేశం ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్ - నవాజ్ (Pakistan Muslim League - Nawaz) (పీఎంఎల్-ఎన్), పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (Pakistan Peoples Party) (పీపీపీ)ల తరఫున ప్రధాని అభ్యర్థిగా ఉన్న షెహబాజ్.. ఆదివారం జాతీయ అసెంబ్లీలో నిర్వహించిన ఓటింగ్‌లో 336 ఓట్లకు గాను 201 ఓట్లు పొందారు.

పాకిస్తాన్ ప్రధానిగా (Pakistan Prime Minister) ఎవరు ఎంపిక అవుతారు? అనే ఉత్కంఠకు తెరపడింది. షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) వరుసగా రెండోసారి దాయాది దేశం ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్ - నవాజ్ (Pakistan Muslim League - Nawaz) (పీఎంఎల్-ఎన్), పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (Pakistan Peoples Party) (పీపీపీ)ల తరఫున ప్రధాని అభ్యర్థిగా ఉన్న షెహబాజ్.. ఆదివారం జాతీయ అసెంబ్లీలో నిర్వహించిన ఓటింగ్‌లో 336 ఓట్లకు గాను 201 ఓట్లు పొందారు. పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీకి చెందిన ఒమర్ అయూబ్ ఖాన్‌కి (Omar Ayub Khan) మాత్రం 92 ఓట్లే దక్కాయి. దీంతో.. షెహబాజ్‌కి ఎక్కువ మెజారిటీ రావడంతో, ఆయనే పీఎంగా ఎంపికయ్యారు. జాతీయ అసెంబ్లీలో ప్రధానిని ఎంపిక చేసే సమయంలో కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. పీటీఐ మద్దతుదారులు గట్టిగట్టిగా నినాదాలు చేశారు. అయితే.. ఈ గందరగోళ పరిస్థితిలోనే షెహబాజ్ ప్రధానిగా ఎన్నికయ్యారు. సోమవారం (మార్చి 4వ తేదీన) రాష్ట్రపతి భవనంలో ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.


నిజానికి.. ఇంతకుముందు మూడుసార్లు పాక్ ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించిన నవాజ్ షరీఫ్ (Nawaz Sharif), నాలుగోసారి కూడా ప్రధాని అవ్వాలని కోరుకున్నారు. అందుకు గాను తీవ్రస్థాయిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కానీ.. ఫిబ్రవరి 8వ తేదీన జరిగిన ఎన్నికల్లో పీఎంఎల్-ఎన్ (80 సీట్లు మాత్రమే) పార్టీకి తగిన మెజారిటీ రాలేదు. పీపీపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసైనా ప్రధాని అవ్వాలని కలలు కన్నారు. కానీ.. అనూహ్మంగా పాక్ ఆర్మీ (Pakistan Army) రంగంలోకి దిగడంతో లెక్కలన్నీ తారుమారు అయ్యారు. ఆర్మీ పెట్టిన కొన్ని షరతుల నేపథ్యంలో.. కూతురు మరియం (Maryam Nawaz Sharif) పంజాబ్ సీఎం అవ్వాలన్న లక్ష్యంతో ప్రధాని పదవిని నవాజ్ త్యాగం చేశారు. ఈ విధంగా షెహబాజ్ పాక్ ప్రధాని అయ్యారు. ఇప్పుడు షెహబాజ్ ముందు ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణంతో పాటు మరెన్నో సవాళ్లు ముందున్నాయి. మరి, వీటిని ఆయన ఎలా పరిష్కరిస్తాడో చూడాలి.

Updated Date - Mar 03 , 2024 | 03:29 PM

Advertising
Advertising