ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

రాజ్యాధికారంతోనే సాధికారత!

ABN, Publish Date - Mar 08 , 2024 | 01:19 AM

మాతృదేవోభవ అంటూ స్త్రీ గౌరవానికి అగ్రతాంబూలం ఇచ్చిన దేశం మనది. దేశాన్ని భరతమాత అని సంబోధిస్తున్నాం. స్త్రీని దేవతతో సమానంగా పూజించే భారతావనిలో మహిళలపై వేధింపులు నిత్యకృత్యమయ్యాయి...

మాతృదేవోభవ అంటూ స్త్రీ గౌరవానికి అగ్రతాంబూలం ఇచ్చిన దేశం మనది. దేశాన్ని భరతమాత అని సంబోధిస్తున్నాం. స్త్రీని దేవతతో సమానంగా పూజించే భారతావనిలో మహిళలపై వేధింపులు నిత్యకృత్యమయ్యాయి. కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు ఆడవారిపై ఏదో ఒక ఘాతుకం. అలనాటి నిర్భయ ఘటన యావత్ భారతావనిని తీవ్ర వేదనకు గురి చేసింది. ప్రజలు ఆగ్రహంగా ప్రతిస్పందించారు. హత్యాచారాలు లేని భారతదేశం కావాలని ముక్తకంఠంతో నినదించారు. నిర్భయ ఘటన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అటువంటి అకృత్యాలను నివారించడానికి నిర్భయ చట్టానికి రూపకల్పన చేసింది. కఠినమైన శిక్షలు ఉన్నా, ఆలోచనల్లో మార్పు రానంతవరకు ఎన్ని చట్టాలున్నా వృధా. అర్ధరాత్రి ఏ భయం లేకుండా స్త్రీ ఒంటరిగా ఎప్పుడైతే రోడ్లపై వెళ్తుందో అప్పుడే భారతావనికి నిజమైన స్వాతంత్య్రం అని మహత్ముడు అంటే, ఇప్పుడు కనీసం పట్టపగలు ఒంటరిగా తిరిగే పరిస్థితులు లేకుండా పోయాయి. గల్లీల్లో తిరిగే అబ్బాయిల నుంచి రాజకీయ నేతల వరకు మహిళలను వేధిస్తున్నారు. మహిళలు కనుక స్వేచ్ఛను కోరుకుంటే నగ్నంగా ఎందుకు తిరగడంలేదని వ్యాఖ్యానించి, స్వేచ్ఛ అనే పదానికి వక్రభాష్యం చెప్పారు హర్యానా సిఎం ఖట్టార్. మహిళా స్వేచ్ఛ వినాశనానికి పునాది అంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. మహిళను తీవ్ర ఆగ్రహానికి, ఆవేదనకు గురి చేసే వ్యాఖ్యలు చేశారు మరో బీజేపీ నేత బాబులాల్ గౌర్. కొన్ని సమయాల్లో మానభంగం సరైనదేనట, కొన్ని సమయాల్లో మాత్రమే తప్పట. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ మాజీ మంత్రి బానే ఊపుతున్నావని, మహబూబ్‌నగర్ జడ్పీ చైర్మన్ మహిళను కత్తిలా ఉన్నావని వ్యాఖ్యానించడం... ఇలా రాష్ట్రంలో ఎన్నో సంఘటనలు. తెలంగాణ ఉద్యమంలో పురుషులతో సమానంగా మహిళలు ఉద్యమించారు. జెండాలు మోసి, ప్రత్యేక రాష్ట్రం కోసం వీరోచితంగా పోరాడారు. అయినా కూడా దేశంలోనే మహిళా మంత్రి లేకుండా ప్రభుత్వాన్ని నడిపిన ఘనత కేసీఆర్‌ది. మహిళా సాధికారత విషయంలో గత ప్రభుత్వ వైఫల్యాలు ప్రస్ఫుటంగా కన్పిస్తాయి. తెలంగాణ నుంచి ఇప్పటివరకు ఒక్క బీసీ మహిళ కూడా లోక్‌సభలో అడుగుపెట్టలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇది జరగలేదు.

రాష్ట్రంలో రేవంతన్న ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజులకే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.10 లక్షల ఆరోగ్యశ్రీ ప్రారంభించి విజయవంతం చేశారు. వంద రోజులు గడవక ముందే మరో రెండు హామీలు ఆడబిడ్డలకు కానుకగా రేవంత్ అన్న అందించారు. జీరో కరెంటు బిల్లు మరియు 500 రూపాయలకే సిలిండర్ అక్కాచెల్లెళ్లకు అందించినారు. తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలు ఆర్థిక పరిపుష్టితో ఎదగాలన్న ఇందిరాగాంధీ లక్ష్యాన్ని రేవంతన్న నెరవేరుస్తున్నారు.

యూపీఏ హయాంలో రాజ్యసభలో బలం ఉండటంతో చారిత్రాత్మకమైన మహిళా బిల్లును ప్రవేశపెట్టి ఆమోదానికి కాంగ్రెస్‌ కృషి చేసింది. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ బిల్లును ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్‌లో చట్టం చేసింది కానీ, ఈ పార్లమెంట్ ఎన్నికల్లోగా దానికి మోక్షం లేకుండా డీలిమిటేషన్‌తో ముడిపెట్టింది. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ వలె బీసీ మహిళా కోటాను అమలు చేయాలని ఈ మహిళా దినోత్సవాన యావత్ మహిళా లోకం ఆశిస్తున్నది. రాజ్యాధికారంతోనే మహిళా సాధికారత సాధ్యమవుతుంది.

ఇందిరాశోభన్, కాంగ్రెస్ నాయకురాలు

Updated Date - Mar 08 , 2024 | 01:19 AM

Advertising
Advertising