ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

స్వల్ప లాభాలతో.. సరికొత్త గరిష్ఠాలకు

ABN, Publish Date - Mar 08 , 2024 | 02:52 AM

భారత స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు గురువారం ట్రేడింగ్‌లో తీవ్ర ఊగిసలాటలకు లోనైనప్పటికీ, చివరికి స్వల్ప లాభాలతో సరికొత్త జీవిత కాల గరిష్ఠాలకు చేరుకోగలిగాయి...

మార్కెట్‌ సూచీలు మరింత ముందుకు..

ముంబై: భారత స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు గురువారం ట్రేడింగ్‌లో తీవ్ర ఊగిసలాటలకు లోనైనప్పటికీ, చివరికి స్వల్ప లాభాలతో సరికొత్త జీవిత కాల గరిష్ఠాలకు చేరుకోగలిగాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 159.18 పాయింట్లు పెరిగి 74,245.17 వద్ద ఆల్‌టైం ఇంట్రాడే రికార్డును నమోదు చేసింది. ట్రేడింగ్‌ ముగిసేసరికి, 33.40 పాయింట్ల లాభంతో 74,119.39 వద్ద స్థిరపడింది. సూచికిది సరికొత్త గరిష్ఠ ముగింపు కూడా. నిఫ్టీ సైతం ఒక దశలో 51.6 పాయింట్లు పెరిగి 22,525.65 వద్ద ఇంట్రాడే రికార్డును, చివర్లో 19.50 పాయింట్ల లాభంతో 22,493.55 వద్ద ఆల్‌టైం గరిష్ఠ ముగింపును నమోదు చేసింది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల కొత్త పెట్టుబడుల దన్నుతో మెటల్‌, ఎఫ్‌ఎంసీజీ రంగ షేర్లలో జరిగిన కొనుగోళ్లు మార్కెట్‌ సూచీలను మరింత ముందుకు నడిపించాయి.

సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో 20 లాభపడ్డాయి. టాటా స్టీల్‌ షేరు 3.90 శాతం ఎగబాకి సూచీ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. టాటా మోటార్స్‌, జేఎ్‌సడబ్ల్యూ స్టీల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు రెండు శాతానికి పైగా పెరిగాయి. ఎం అండ్‌ ఎం మాత్రం అత్యధికంగా 3.68 శాతం క్షీణించింది. మార్కెట్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు ఒక శాతానికి పైగా నష్టపోయాయి. కాగా, బీఎ్‌సఈలోని స్మాల్‌క్యాప్‌ సూచీ 0.70 శాతం, మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 0.39 శాతం లాభపడ్డాయి. రంగాలవారీ సూచీల్లో మెటల్‌, క్యాపిటల్‌ గూడ్స్‌, కమోడిటీస్‌, ఎఫ్‌ఎంసీజీ ఒక శాతం 1.36 శాతం వరకు పెరిగాయి.

ముక్కా ప్రొటీన్‌ లిస్టింగ్‌ అదరహో

ఫిష్‌ మీల్‌, ఫిష్‌ ఆయిల్‌ తయారీ కంపెనీ ముక్కా ప్రొటీన్స్‌ లిస్టింగ్‌కు ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించింది. గురువారం కంపెనీ షేర్లు స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ల్లో నమోదయ్యాయి. ఐపీఓ ధర రూ.28తో పోలిస్తే, బీఎ్‌సఈలో కంపెనీ షేరు 57.14 శాతం ప్రీమియంతో రూ.44 వద్ద లిస్టయింది. తొలి రోజు ట్రేడింగ్‌ నిలిచేసరికి 50.92 శాతం లాభంతో రూ.42.26 వద్ద ముగిసింది. దాంతో కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.1,267.80 కోట్లుగా నమోదైంది. సోమవారంతో ముగిసిన ముక్కా ప్రొటీన్‌ ఐపీఓకు సైతం అపూర్వ స్పందన లభించింది. ఇష్యూ సైజుతో పోలిస్తే 136.89 రెట్ల బిడ్లు లభించాయి.

Updated Date - Mar 08 , 2024 | 02:52 AM

Advertising
Advertising