సరుకు రవాణాలో విశాఖ పోర్టు రికార్డు
ABN, Publish Date - Mar 03 , 2024 | 01:50 AM
విశాఖపట్నం పోర్టు సరుకు రవాణాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియక ముందే రికార్డు సాధించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 73.73 మిలియన్ టన్నుల సరకును...
విశాఖపట్నం (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం పోర్టు సరుకు రవాణాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియక ముందే రికార్డు సాధించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 73.73 మిలియన్ టన్నుల సరకును రవాణా చేసి రికార్డు నమోదు చేసింది. పోర్టు చరిత్రలో ఇదే అత్యధిక సరుకు రవాణా. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) ముగియడానికి ఇంకో నెల రోజులు ఉండగానే పోర్టు గత ఆర్థిక సంవత్సర రికార్డును అధిగమించింది. ఫిబ్రవరితో ముగిసిన కాలానికి 73.78 మిలియన్ టన్నుల సరుకును పోర్టు రవాణా చేసింది.
Updated Date - Mar 03 , 2024 | 01:50 AM