ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఏఐతో బీపీఓ ఉద్యోగాలకు ముప్పే

ABN, Publish Date - Mar 04 , 2024 | 03:55 AM

బిజినెస్‌ ప్రాసెస్‌ ఔట్‌సోర్సింగ్‌ (బీపీఓ) ఉద్యోగాలకు పెద్దముప్పు పొంచి ఉంది. ఉత్పాదక కృత్రిమ మేధ (ఏఐ)తో వీరి ఉద్యోగాలు ఎక్కువగా గల్లంతయ్యే ప్రమాదం ఉందని నాస్కామ్‌ చైర్మన్‌ రాజేశ్‌ నంబియార్‌ హెచ్చరించారు.

ముంబై: బిజినెస్‌ ప్రాసెస్‌ ఔట్‌సోర్సింగ్‌ (బీపీఓ) ఉద్యోగాలకు పెద్దముప్పు పొంచి ఉంది. ఉత్పాదక కృత్రిమ మేధ (ఏఐ)తో వీరి ఉద్యోగాలు ఎక్కువగా గల్లంతయ్యే ప్రమాదం ఉందని నాస్కామ్‌ చైర్మన్‌ రాజేశ్‌ నంబియార్‌ హెచ్చరించారు. ఐటీ సేవల ఉద్యోగులకు మాత్రం ఏఐ ముప్పు పెద్దగా ఉండకపోవచ్చన్నారు. అయితే ఐటీ సేవల ఉద్యోగులు కూడా తమ పనుల్లో ఏఐని భాగం చేసుకోవాల్సి ఉంటుందన్నారు. లేకపోతే ఏఐపై పట్టు ఉన్న ఉద్యోగులు వారి స్థానాలను భర్తీ చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఫుణెలో జరిగిన ఒక సదస్సులో ఆయన ఈ హెచ్చరిక చేశారు. క్లయింట్ల డిమాండ్లకు అనుగుణంగా భారత ఐటీ కంపెనీలు ఉద్యోగులకు పెద్దఎత్తున ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తున్న నేపథ్యంలో నంబియార్‌ ఈ హెచ్చరిక చేయడం విశేషం. ఒక సమస్య పరిష్కారానికి లేదా ఇప్పటికే ఉన్న వ్యవస్థలతో ఏఐని అనుసంధానం చేయగలిగినప్పుడే అసలు ప్రభావం కనిపిస్తుందన్నారు. ఏఐ.. టెక్నాలజీ ఆఫీసుల్లో పని చేసే ఈక్విటీ అనలిస్టులు, గణాంక నిపుణుల వంటి వైట్‌ కాలర్‌ ఉద్యోగుల కొలువులనే ఎక్కువగా ప్రభావితం చేస్తుందన్నారు. ఏసీలు, లైట్లను బాగు చేసే టెక్నీషియన్‌ కొలువులకు మాత్రం ఏఐతో పెద్దగా ఇబ్బంది ఉండదని నంబియార్‌ స్పష్టం చేశారు.

Updated Date - Mar 04 , 2024 | 03:55 AM

Advertising
Advertising