నెఫ్రోప్లస్ చేతికి ఫిలిప్పీన్స్ కంపెనీ
ABN, Publish Date - Mar 08 , 2024 | 02:38 AM
హైదరాబాద్ కేంద్రంగా డయాలసిస్ సేవలందించే నెఫ్రోప్లస్.. ఫిలిప్పీన్స్‌లో తన కార్యకలాపాలను మరింత విస్తరిస్తోంది. ఇందు కోసం ఆ దేశంలో ఆరు డయాలసిస్ కేంద్రాలు నడుపుతున్న రెనల్ థెరపీ...
హైదరాబాద్ కేంద్రంగా డయాలసిస్ సేవలందించే నెఫ్రోప్లస్.. ఫిలిప్పీన్స్‌లో తన కార్యకలాపాలను మరింత విస్తరిస్తోంది. ఇందు కోసం ఆ దేశంలో ఆరు డయాలసిస్ కేంద్రాలు నడుపుతున్న రెనల్ థెరపీ సొల్యూషన్స్ ఇంక్ (ఆర్‌టీఎస్‌ఐ) అనే కంపెనీని కొనుగోలు చేసింది. నెఫ్రోప్లస్ వ్యవస్థాపకుడు, సీఈఓ విక్రమ్ ఉప్పల సోషల్ మీడియా వేదికగా ఈ విషయం ప్రకటించారు. అయితే ఆర్‌టీఎస్‌ఐను ఎంతకు కొనుగోలు చేసిందనేది మాత్రం ఆయన వెల్లడించలేదు. 2020 అక్టోబరులోనూ నెఫ్రోప్లస్.. ఫిలిప్పీన్స్‌కు చెందిన రాయల్ కేర్ డయాలసిస్ సెంటర్స్ ఇంక్ (ఆర్‌సీడీసీ) ఈక్విటీలో మెజారిటీ వాటా కొనుగోలు చేసింది. తాజాగా ఆర్‌టీఎస్‌ఐ కొనుగోలుతో ఆ దేశంలో నెఫ్రోప్లస్ డయాలసిస్ కేంద్రాల సంఖ్య 27కు చేరింది. నెఫ్రోప్లస్ ఇప్పటికే భారత్‌తో పాటు నేపాల్, ఉజ్బెకిస్థాన్, ఫిలిప్పీన్స్ దేశాల్లోని 230 నగరాల్లో 385 కేంద్రాల ద్వారా డయాలసిస్ సేవలు అందిస్తోంది.
Updated Date - Mar 08 , 2024 | 02:38 AM