బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లపై లుక్కేయండి..!
ABN, Publish Date - Mar 04 , 2024 | 03:54 AM
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారం మెరుగ్గా కదలాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థానిక, అంతర్జాతీయ పరిణామాలు ఇన్వెస్టర్లలో పాజిటివ్ సెంటిమెంట్‌ను నింపాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారం మెరుగ్గా కదలాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థానిక, అంతర్జాతీయ పరిణామాలు ఇన్వెస్టర్లలో పాజిటివ్ సెంటిమెంట్‌ను నింపాయి. ఈ వారం కొనుగోళ్ల జోరు కొనసాగే అవకాశం ఉంది. అయితే ఫియర్ ఇండెక్స్ ఇండియా విక్స్ ఇంకా 15 స్థాయిలోనే ఉండటం అప్రమత్తతను సూచిస్తోంది. నిఫ్టీ మార్చి నెల మద్దతు స్థాయి 22,300, నిరోధ స్థాయిలు 22,500 వద్ద ఉన్నాయి. గత వారం మెటల్స్, ఆటో సూచీలు రాణించాయి. అయితే శుక్రవారం నాటి ఎఫ్‌ఐఐ గణాంకాలను చూస్తే ఈ వారం బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో బుల్లి్‌షనెస్ ఉండొచ్చు.
స్టాక్ రికమండేషన్స్
డేటా ప్యాటర్న్స్: కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను సరళీకరిచటం ఈ కౌంటర్‌కు కలిసి వచ్చింది. కొన్నాళ్లుగా ట్రేడింగ్, డెలివరీ వాల్యూమ్ విపరీతంగా పెరుగుతోంది. చివరి మూడు రోజుల్లోనే ఈ షేరు 24 శాతం మేర పెరిగింది. సుదీర్ఘ కాలం కన్సాలిడేషన్ కావటం మరో పాజిటివ్ అంశం. ఇన్వెస్టర్లు ఈ కౌంటర్‌లో రూ.2,650 స్థాయిలో ప్రవేశించి రూ.2,710/2,850 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.2,610 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
జిందాల్ స్టీల్: ఈ షేరు సరికొత్త జీవిత కాల గరిష్ఠాన్ని తాకటంతో ఇన్వెస్టర్ల చూపు ఈ కౌంటర్‌పై పడింది. నిఫ్టీతో పోల్చితే మెరుగైన ప్రదర్శన, నిరోధ స్థాయిలో సుదీర్ఘకాలం అక్యుములేషన్ జరగటం సానుకూల అంశాలు. పైగా షేరు విలువ అప్పర్ బొలింజర్ బ్యాండ్‌ను అధిగమించటం బుల్లి్‌షనె్‌సను సూచిస్తోంది. మూమెంటమ్ ట్రేడర్లు ఈ కౌంటర్‌లోకి రూ.810 స్థాయిలో ఎంటర్ అయి రూ.880/940 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.790 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
డిక్సన్ టెక్నాలజీస్: కన్స్యూమర్ ఎలకా్ట్రనిక్స్ తయారీలో ఉన్న ఈ సంస్థకు భారీగా కొత్త ఆర్డర్లు వస్తున్నాయి. డెహ్రడూన్‌లోనూ కొత్త ప్లాంట్‌ను ఆరంభించే యోచనలో ఉంది. గత ఏడాది ఆరంభం నుంచి ఈ కౌంటర్ అప్‌ట్రెండ్‌లో కొనసాగుతోంది. వాల్యూమ్‌ను బట్టి స్టాక్ డిమాండ్‌ను అర్ధం చేసుకోవచ్చు. ట్రేడర్లు ఈ కౌంటర్‌లోకి రూ.6,950/6,980 శ్రేణిలో ప్రవేశించి రూ.7,120/7,355 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.6,900 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
టైటాన్: ఈ కౌంటర్‌కు చాలా సానుకూలతలు కనిపిస్తున్నాయి. నిఫ్టీతో పోల్చితే మెరుగ్గా ట్రేడవుతోంది. అప్పర్ బొలింజర్ బ్యాండ్‌ను క్రాస్ చేసింది. చివరి ఐదు సెషన్లలో ట్రేడింగ్, డెలివరీ వాల్యూమ్ ఒకటిన్నర రెట్లు పెరిగింది. ఇన్వెస్టర్లు ఈ కౌంటర్‌లోకి రూ.3,700 స్థాయి ల్లో ప్రవేశించి రూ.3,830/3,950 టార్గెట్ ధరతో కొనుగో లు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ. 3,675 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
గ్రాసిమ్: గత వారం ఈ కౌంటర్ సరికొత్త జీవితకాల గరిష్ఠాన్ని అందుకుంది. పైగా రూ.2,000 స్థాయిలో మంచి అక్యుములేషన్ జరుగుతోంది. వాల్యూమ్స్ కూడా పెరుగుతున్నాయి. జెఫ్రీస్ సహా అనేక రేటింగ్ సంస్థలు.. కంపెనీ షేరు టార్గెట్ ధరను పెంచి ‘బై’ కాల్ ఇచ్చాయి. మదుపరులు ఈ కౌంటర్‌లోకి రూ.2,240 స్థాయిలో పొజిషన్ తీసుకుని రూ.2,380/2,500 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.2,222 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
Updated Date - Mar 04 , 2024 | 03:54 AM