రూ.11 లక్షల కోట్లకు ద్రవ్యలోటు
ABN, Publish Date - Mar 01 , 2024 | 06:05 AM
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో జనవరితో ముగిసిన పది నెలలకు ద్రవ్యలోటు రూ.11 లక్షల కోట్లకు పెరిగింది. బడ్జెట్‌లో అంచనాలో 63.6 శాతానికి సమానమిది...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో జనవరితో ముగిసిన పది నెలలకు ద్రవ్యలోటు రూ.11 లక్షల కోట్లకు పెరిగింది. బడ్జెట్‌లో అంచనాలో 63.6 శాతానికి సమానమిది. 2023-24 బడ్జెట్‌లో ప్రభుత్వం ద్రవ్యలోటును రూ.17.35 లక్షల కోట్లు (జీడీపీలో 5.8 శాతం)గా అంచనా వేసింది. ప్రభుత్వ ఆదాయ, వ్యయ అంతరాన్ని ద్రవ్యలోటు అంటారు. మార్కెట్ నుంచి రుణాలు సమీకరించడం ద్వారా ప్రభుత్వం ఈ లోటును పూడ్చుకుంటుంది. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) గురువారం విడుదల చేసిన డేటా ప్రకారం.. గడిచిన పది నెలల్లో మొత్తం రూ.22.52 లక్షల కోట్ల (సవరించిన బడ్జెట్ అంచనాలో 81.7 శాతం) ఆదాయం సమకూరగా.. మొత్తం వ్యయం రూ.33.54 లక్షల కోట్లుగా (సవరించిన బడ్జెట్ అంచనాలో 74.7 శాతం) నమోదైంది.
Updated Date - Mar 01 , 2024 | 06:49 AM