ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కి‘లేడీ’లు

ABN, Publish Date - Mar 08 , 2024 | 12:22 AM

బంగారం దుకాణానికి వెళ్లి బంగారు ఉంగరాలు కొట్టేసి రోల్డ్‌గోల్డ్‌ పెట్టి ఉడాయించిన సంఘటన జంగా రెడ్డిగూడెంలో చోటుచేసుకుంది.

జ్యూయలరీ దుకాణంలో చేతివాటం

గిల్ట్‌వి పెట్టి బంగారం నొక్కేశారు

సీసీ కెమేరాకు చిక్కిన వైనం

జంగారెడ్డిగూడెం టౌన్‌, మార్చి 7: బంగారం దుకాణానికి వెళ్లి బంగారు ఉంగరాలు కొట్టేసి రోల్డ్‌గోల్డ్‌ పెట్టి ఉడాయించిన సంఘటన జంగా రెడ్డిగూడెంలో చోటుచేసుకుంది. మసీదు సెంటర్‌లో ఉన్న సాయిశ్రీ జ్యువె లర్స్‌లో ఇద్దరు మహిళలు బంగారం కొనుగోలు చేయడానికి వచ్చారు. శుభకార్యం ఉందని ఉంగరాలు చూపించమనడంతో ఉంగరాలను అందిం చాడు. వారికి ఎటువంటి అనుమానం రాకుండా బంగారపు ఉంగరాలు కాజేసి వాటి స్థానంలో రోల్డ్‌ గోల్డ్‌ ఉంగరాలను ఉంచారు. మళ్లీ వస్తా మంటూ కొనుగోలు చేయకుండా అక్కడ నుంచి వెళ్లిపోయారు. యజ మానికి అనుమానం రావడంతో సీసీ కెమేరాలు పరిశీలించారు. సుమారు కాసు బరువున్న రెండు ఉంగరాలు కాజేసినట్లు గుర్తించారు. బుధవారం మునిసిబ్‌ గారి వీధిలో మరో జ్యూయలరీ దుకాణంలో సుమారు కాసున్నర బంగారం కాజేసినట్లు తెలిసింది. దీనిపై పోలీసులకు ఫిర్యాధు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Updated Date - Mar 08 , 2024 | 12:22 AM

Advertising
Advertising