ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సర్పంచ్‌ల ఆందోళన ఉద్రిక్తం

ABN, Publish Date - Mar 03 , 2024 | 12:15 AM

కేంద్ర ఆర్థికసంఘం నిధులను పంచాయతీల ఖాతాలో జమ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఉమ్మడి పశ్చిమ గోదావరి సర్పంచ్‌లు కలెక్టరేట్‌ వద్ద చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది.

సర్పంచ్‌లను అడ్డుకుంటున్న పోలీసులు

కలెక్టరేట్‌ వద్ద అడ్డుకున్న పోలీసులు

మెయిన్‌గేటు వద్ద నిరసన

ఏలూరు కలెక్టరేట్‌, మార్చి 2 : కేంద్ర ఆర్థికసంఘం నిధులను పంచాయతీల ఖాతాలో జమ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఉమ్మడి పశ్చిమ గోదావరి సర్పంచ్‌లు కలెక్టరేట్‌ వద్ద చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళనలో పా ల్గొన్న సర్పంచ్‌ల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. స్థానిక సంస్థల నిధులు కాజేసిన సీఎం జగన్మోహన్‌రెడ్డి ఆ నిధులను పంచాయతీ ఖాతాల్లోకి జమ చేయాలని కోరుతూ ఆందోళనలో భాగంగా ఏపీ పంచాయతీరాజ్‌ ఛాంబర్‌, సర్పం చ్‌ల సంఘం ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్‌ వద్ద ఆందోళన నిర్వహించారు. కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందు కు బారికేడ్‌లు తొలగించారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత వాతావరణం నెల కొంది. బారి కేడ్‌లు తోసుకుని కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు మె యిన్‌గేటును మూసివేయడంతో అక్కడే నిరసన తెలిపారు. ప్రజాప్రతినిధులను కలె క్టరేట్‌లోకి వెళ్లకుండా నిలువరించడం సరికాదని మండి పడ్డారు. పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ రాష్ట్ర అధ్యక్షుడు వై.వి.వి రాజేంద్రప్రసాద్‌ రాష్ట్రం లో స్థానిక సంస్థల నిధులు, విధులు, అధి కారాలను జగన్మోహన్‌రెడ్డి దొంగిలించారని మండిపడ్డారు. గ్రామాలు బాగు పడాలన్నా గ్రామీణాభివృద్ధి జరగాలన్నా రాష్ట్రంలోని రూ.3కోట్ల5లక్షల గ్రామీణ ప్రజల స్థితిగతులు మెరుగుపడాలంటే ఎన్నికల్లో సీఎం జగన్మోహన్‌ రెడ్డిని ఓడించాల్సిందేనని, జగన్‌ ఓడితేనే సర్పంచ్‌ లకు మనుగడ అని పేర్కొన్నారు. పంచాయతీ ఛాంబర్‌ ఉభయ గోదావరి అధ్యక్షుడు కడలి గోపాల రావు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు పాలడుగుల లక్ష్మణరావు మాట్లాడుతూ పంచాయతీల ఖాతాల్లో ఆర్థిక సంఘం నిధులు జమ చేయాలని కోరితే పోలీసులతో గొంతు నొక్కుతారా అంటూ ప్రశ్నించారు. 14,15 ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అంద జేశారు. ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్‌రెడ్డి, వై.వినోద్‌రాజు, చుక్కా ధనుంజయ్‌ యాదవ్‌, సర్పంచ్‌ల సంఘం గౌరవ సలహాదారు పిల్లి సత్యరాజు, లంకపల్లి మాణిక్యాలరావు, కడియాల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 03 , 2024 | 12:15 AM

Advertising
Advertising