ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

తాబేళ్ల దొంగలు!

ABN, Publish Date - Mar 03 , 2024 | 12:29 AM

విదేశీ, స్వదేశీ విహాంగాలు, అనేకరకాల మత్స్య జాతులకు కొల్లేరుకు ప్రిసిద్ది చెందింది. తాబేళ్లు సైతం ఇక్కడ ఎక్కువగా కన్పిస్తాయి. వీటిపై కన్నుపడిన కొంతమంది అక్ర మార్జన కోసం కొల్లేరును కేంద్రంగా చేసుకుని వివిధ రాష్ట్రాలకు దశాబ్దకాలంగా తాబేళ్ల అక్రమ రవాణా సాగిస్తున్నారు.

కొల్లేరు కేంద్రంగా అక్రమ రవాణా!

పొరుగు రాష్ట్రాలకు సరఫరా

లక్షల్లో జేబులు నింపుకుంటున్న అక్రమార్కులు

పట్టించుకోని అధికారులు

కైకలూరు, మార్చి 2 : విదేశీ, స్వదేశీ విహాంగాలు, అనేకరకాల మత్స్య జాతులకు కొల్లేరుకు ప్రిసిద్ది చెందింది. తాబేళ్లు సైతం ఇక్కడ ఎక్కువగా కన్పిస్తాయి. వీటిపై కన్నుపడిన కొంతమంది అక్ర మార్జన కోసం కొల్లేరును కేంద్రంగా చేసుకుని వివిధ రాష్ట్రాలకు దశాబ్దకాలంగా తాబేళ్ల అక్రమ రవాణా సాగిస్తున్నారు. కాల్వ లు, మురుగు డ్రెయిన్లు, చిన్నచిన్న నీటికుంటల్లో ఇవి పుష్కలంగా సంచరిస్తుంటాయి. చెరువుల్లో చేపల పట్టుబడుల సమయంలో, కొల్లేరులో చేపల పట్టే సమయంలో చేతికి చిక్కిన తాబేళ్లను కూలీలు, మత్స్యకారులు దాచి ఉంచుతారు. కైకలూరు, కలిదిండి, మండవల్లి, ముదినేపల్లి మండలాల్లోని గ్రామాల్లో ఇలా సేకరించిన తాబేళ్లను కొంతమంది కొంటు న్నారు. తాబేలు సైజును బట్టి ధర నిర్ణయిస్తారు. పెద్దగా ఉన్న వాటికి రూ.30 వరకు వెల కడుతుంటారు. ఇలా పోగు చేసిన వాటిని డ్రమ్ముల్లోనూ, గోనె సంచుల్లో ఖాళీ ప్రదేశాల్లో, చెరువు గట్లపైన నిల్వ ఉంచుతుంటారు. ఇవి టన్నుల్లో దొరి కిన తర్వాత కర్ణాటక, గోవా, అసోం తదితర ఇతర రాష్ట్రాలకు వ్యానుల ద్వారా రవాణా చేస్తూ లక్షల్లో ఆదాయాలను పొందు తున్నారు. ఇతర రాష్ట్రాల్లో వీటి మాంసానికి మంచి గిరాకీ ఉంది. సుమారు కేజీ రూ.400 చొప్పున కొనుగోలు చేస్తుంటా రు. వ్యానుల్లో అడుగు భాగంలో తాబేళ్లను ఉంచి పైన చేపల ట్రేలను ఉంచి తీసుకెళ్తుంటారు. జిల్లాల సరిహద్దుల్లో వీటిని తనిఖీ చేసినా చూసేవారికి చేపల రవాణా అవుతున్నట్టుగా నే ఉంటుంది. కొన్ని చెక్‌పోస్టుల్లో గుర్తించినా మామూళ్లు దండుకుని వదిలివేస్తుంటారు. ఒక్కొక్క వ్యానులో సరఫరా చేసిన తాబేళ్ల వల్ల సుమారు రూ.2లక్షలు ఖర్చులు పోను మిగులుతుంటాయి. ఇటీవల పోలీసుల తనిఖీల్లో పలు వాహ నాల్లో అక్రమ తాబేళ్లను గుర్తించి కేసులు నమోదు చేసినా ఈ దందా కొనసాగుతూనే ఉంది. గతేడాది ఫిబ్రవరి 27వ తేదీన కైకలూరు మండలం వదర్లపాడు బ్రాంచి వద్ద పోలీ సుల తనిఖీల్లో ఒక ఆటో, మినీ వ్యానులో 25 గోనె సంచిల్లో సుమారు 4 క్వింటాల తాబేళ్లను గుర్తించి ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ తాబేళ్లను తణుకుకు తీసుకువెళ్లి అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న ట్టు పోలీసులు గుర్తించారు. ఇటీవల కలిదిండి మండలం సానారుద్రవరంలో అర్ధరాత్రి సమయంలో వ్యానులోనికి తాబేళ్లను ఎక్కిస్తున్నవారిని పోలీసులు అరెస్టు చేసి 40 బస్తాల్లో సుమారు 2వేల కేజీల తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇలా స్వాధీనం చేసుకున్న వాటిని అటవీశాఖ సిబ్బందికి అప్పగించి తిరిగి కొల్లేరు సరస్సులో వదిలివేస్తున్నారు. వీటిని అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకుంటే తాబేళ్ల మనుగడను కాపాడవచ్చని పలువురు పేర్కొంటున్నారు.

Updated Date - Mar 03 , 2024 | 12:30 AM

Advertising
Advertising