నేడే పల్స్‌పోలియో
ABN, Publish Date - Mar 03 , 2024 | 12:11 AM
జిల్లావ్యాప్తంగా ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ డి.మహేశ్వరరావు తెలిపారు. ఐదేళ్లలోపు 1,85,593 మంది పిల్లలకు వ్యాక్సినేషన్ చేయనున్నట్లు వివరించారు.
ఐదేళ్లలోపు 1,85,593 మంది చిన్నారుల గుర్తింపు : డీఎంహెచ్‌వో
భీమవరం, మార్చి 2 : జిల్లావ్యాప్తంగా ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ డి.మహేశ్వరరావు తెలిపారు. ఐదేళ్లలోపు 1,85,593 మంది పిల్లలకు వ్యాక్సినేషన్ చేయనున్నట్లు వివరించారు. ఇమ్యునైజేషన్ కార్యక్రమంపై శనివారం తమ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అర్హులైన పిల్లలందరికీ సంపూర్ణంగా పోలియో చుక్కలు అందించేందుకు రెండు లక్షల వ్యాక్సిన్లు సిద్ధంగా ఉన్నా యన్నారు. తొలి రోజు హాజరుకాని వారికి 4, 5వ తేదీల్లో ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్ వేస్తామన్నారు. 2014 తరువాత దేశంలో ఒక్క పోలియో కేసు నమోదు కాలేదన్నారు. జిల్లాలోని 20 మండలాల్లో 34 పీహెచ్‌సీలు, 18 అర్బన్ హెల్త్ సెంటర్లు, ఐదు మునిసిపాలిటీలు, ఒక నగర పంచాయతీలో మొత్తం 1,324 బూత్‌ల వద్ద వైద్య శాఖ సిబ్బంది అధికారులతోపాటు స్వచ్ఛంద సంస్థల సహకారంతో మొత్తం 5,520 మంది వ్యాక్సినేషన్‌లో పాల్గొంటున్నారన్నారు. అవసరం మేరకు జిల్లాలోని ఏరియా ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో చిన్నపిల్లల స్పెషలిస్టులు, ఒక ఎండి, ఒక స్టాఫ్ నర్స్‌ను సిద్ధంగా ఉంచామన్నారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ దేవ సుధ మాట్లాడుతూ వైద్య శాఖ సిబ్బందికి అందరూ సహకరించాలని కోరారు.
Updated Date - Mar 03 , 2024 | 12:11 AM