ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

టీడీపీ, జనసేన కలయికతో రాష్ట్ర ప్రగతి

ABN, Publish Date - Mar 03 , 2024 | 11:54 PM

టీడీపీ– జనసేన కలయిక రాష్ట్ర ప్రగతికి చిహ్నమని మాజీ ఎమ్మెల్యే చింత మనేని ప్రభాకర్‌ అన్నారు.

మాట్లాడుతున్న చింతమనేని ప్రభాకర్‌

నియోజకవర్గాల్లో టీడీపీ ప్రచాక కార్యక్రమాలు

పెదవేగి, మార్చి 3: టీడీపీ– జనసేన కలయిక రాష్ట్ర ప్రగతికి చిహ్నమని మాజీ ఎమ్మెల్యే చింత మనేని ప్రభాకర్‌ అన్నారు. అప్పుల ఆంధ్రాగా మారుతున్న రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని తిరిగి గాడిలో పెట్టేది చంద్రబాబునాయుడు మాత్రమే నన్నారు. దుగ్గిరాలలో టీడీపీ నియోజకవర్గం సమన్వయ కమిటీ సమావేశం ప్రభాకర్‌ అధ్యక్షతన ఆదివారం జరిగింది. సంపదను సృష్టిస్తే సంక్షేమం వస్తుంది, అప్పుతో తినే పప్పుకూడుతో రాదన్నారు. సంపద సృష్టించే మిషన్‌ చంద్రబాబునాయుడు అయితే, దానిని పాడు చేసే కంత్రీ జగన్‌ అన్నారు. జగన్‌ చేస్తున్న మోసాలను ప్రజలు తెలుసుకున్నారని, టీడీపీ, జనసేన కూటమిని ఆదరిస్తారని, వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. పార్టీ పరిశీలకుడు చెన్నుపాటి గాంధీ, జనసేన రాష్ట్ర కార్యదర్శి ఘంటసాల వెంకటలక్ష్మి, యూఎస్‌.రామ్‌ప్రసాద్‌, తాతా సత్యనారాయణ, మోరు శ్రావణి, సైతు సత్యనారాయణ, బొప్పన సుధాకర్‌, మాగంటి నారాయణ ప్రసాద్‌, లావేటి శ్రీనివాసరావు, నంబూరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

వైసీపీని తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధం : రోషన్‌

జంగారెడ్డిగూడెం: వైసీపీని రాష్ట్రం నుంచి తరిమికొ ట్టేందుకు ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారని టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్ధి సొంగా రోషన్‌కుమార్‌ అన్నారు. టీడీపీ, జనసేన సమన్వయ సమావేశం ఆదివారం నిర్వహించారు. టీడీపీ, జనసేన నేతలు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఇంటింటా తీసుకు వెళ్లాలని, టీడీపీ, జనసేన సమన్వయంతో పని చేసి విజయం సాధించాలన్నారు. నియోజకవర్గ పరిశీలకుడు కోళ్ల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి, కరాటం సాయి, జనసేన పోలవరం నియోజకవర్గ ఇన్‌చార్జి చిర్రి బాలరాజు, టీడీపీ నాయకులు గోరుముచ్చు గోపాల్‌ యాదవ్‌, మండవ లక్ష్మణరావు, షేక్‌ ముస్తఫా, పెనుమర్తి రామ్‌కుమార్‌, ముత్తారెడ్డి, పరిమి సత్తిపండు, రావూరి కృష్ణ, శ్రీధర్‌, నియోజకవర్గంలోని టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

హత్యా రాజకీయాలు చేసే వారికి ఓటు వెయ్యవద్దు : బడేటి

ఏలూరు టూటౌన్‌: హత్యా రాజకీయాలు చేసే అన్నకు ఓటు వేయవద్దని ముఖ్యమంత్రి చెల్లెలు సునీత చెబుతున్నారని, ప్రజలు ఆలోచించాలని జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి బడేటి చం టి అన్నారు. ప్రజాసంకల్ప యాత్ర లో భాగంగా ఆదివారం 21, 47వ డివిజన్లలో పర్యటించారు. ఇంటింటికి తిరిగి సూపర్‌ 6పథకాలు వివరించారు. జగన్‌ అధికారంలోకి వస్తే యువత భవిష్యత్‌ అంధకారంలోకి పోతుందన్నారు. ప్రజల ఆశ లకు రక్షణ కూడా ఉండదన్నారు. జగన్‌ పాలనలో రాష్ట్రం దిగజారిపోయిందన్నారు. ఈ పరిస్థితుల్లో జనసేన, టీడీపీ కూటములు అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో ఏ.రామకృష్ణ, భాస్కరరావు, శ్రీనివాస్‌, బాబురావు, శ్రీనివాస్‌, జుంజు మోజేష్‌, తదితరులు పాల్గొన్నారు.

మన ఇంటికి మన గన్ని ప్రచార కార్యక్రమం

భీమడోలు: అంబర్‌పేటలో మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు మన ఇం టికి మన గన్ని పేరుతో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో నియోజకవర్గ, మండల ముఖ్య నాయకులు, తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.

సూపర్‌–6 పథకాలను ప్రజలకు వివరించాలి

కొయ్యలగూడెం: సూపర్‌–6 పథకాలను ప్రతీ ఇం టికి వెళ్లి వివరించాల్సిన బాధ్యత టీడీపీ, జనసేన నాయకులు తీసు కోవాలని టీడీపీ మండల అధ్యక్షు డు నరేష్‌ కోరారు. మండలంలోని బయ్యన్నగూడెంలో ఆదివారం సూపర్‌–6 పథకాలు ప్రజలకు వివరించారు. జనసేన, టీడీపీ కార్యకర్తలు ప్రతీ ఇంటికివెళ్ళి చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్‌ సంయుక్త ప్రభుత్వంలో ప్రజలకు అందించే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించాలని కోరారు. గ్రామాల్లో కార్యకర్తలకు అవగాహాన కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సత్తిపండు, బాలు, నెరుసు రామకృష్ణ, సీతారామ్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Mar 03 , 2024 | 11:54 PM

Advertising
Advertising