పోలియో రహిత సమాజానికి కృషి చేద్దాం
ABN, Publish Date - Mar 03 , 2024 | 11:56 PM
పోలియో రహిత సమాజం కోసం కృషి చేద్దామని, వంద శాతం పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఎంహెచ్‌వో డాక్టర్ మహేశ్వరరావు తెలిపారు.
డీఎంహెచ్‌వో డాక్టర్ మహేశ్వరరావు
పాలకోడేరు/ఉండి/ ఆకివీడు/ ఆకివీడు రూరల్/ కాళ్ల, మార్చి 3: పోలియో రహిత సమాజం కోసం కృషి చేద్దామని, వంద శాతం పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఎంహెచ్‌వో డాక్టర్ మహేశ్వరరావు తెలిపారు. పాలకోడేరులోని పల్స్‌పోలియో బూత్‌ని ఆయనతో పాటు డీఐవో దేవ సుధాలక్ష్మి, జిల్లా ప్రోగ్రామింగ్ ఆఫీసర్ డాక్టర్ భావన ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పాలకోడేరు పీహెచ్‌సీ పరిధిలోని గ్రామాల్లో జరుగుతున్న కార్యక్రమాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డాక్టర్ రంగం నాయుడు, డాక్టర్ స్వర్ణనిరంజని, డాక్టర్ లీలాలక్ష్మి, సీహెచ్‌వో సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. ఉండి మండలం ఉండి పీహెచ్‌సీలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు ప్రారంభించారు. డీసీసీబీ చైర్మన్ పీవీఎల్ నరసింహరాజు, యండగండి సర్పంచ్ చిన్నకృష్ణమూర్తి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఆకివీడు నగర పంచాయతీ కార్యాలయం, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో చిన్నారులకు పోలియో చుక్కలను నగర పంచాయతీ చైర్మన్ జామి హైమావతి వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. భీమవరం ఎన్నికల పరిశీలకులు మోటుపల్లి గంగాధరరావు, నగర పంచాయతీ వైస్ చైర్మన్ పుప్పాల పండు, యూపీహెచ్‌సీ వైద్యుడు వెంకటపతిరాజు తదితరులు ఉన్నారు. ఆకివీడు రూరల్ పెదకాపవరం పీహెచ్‌సీ పరిధిలో మొత్తం 3,434 మంది పిల్లలకు 34 బూత్‌లు, మూడు టీమ్స్, ఒక మొబైల్ టీమ్ ద్వారా 3,350 మందికి చుక్కలు వేశామని వైద్య అధికారులు తెలిపారు. కాళ్ల మండలం కాళ్ల ప్రభుత్వాసుపత్రిలో చిన్నారులకు పోలియో చుక్కలను వేసి కార్యక్రమాన్ని జడ్పీటీసీ పచ్చిగోళ్ళ సోమేశ్వరరావు ప్రారంభించారు. డాక్టర్ ఎస్.సునీల్ మాట్లాడుతూ మండలంలో 43 బూత్‌లద్వారా 7,076 మంది పిల్లలకు 6867 మందికి చుక్కలు వేశామన్నారు.
పాలకొల్లు టౌన్/రూరల్, మార్చి 3 : పోలియో నిర్మూలనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ కోరారు. ఆదివారం పాలకొల్లు ఎల్‌ఆర్‌పేటలోని పల్స్‌పోలియో శిబిరంలో వైద్య సిబ్బం దితో కలిసి ఆయన చిన్నారులకు చుక్కలు వేశారు. పాలకొల్లు మండలం బల్లిపాడులో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు చిన్నారులకు పోలియో చుక్క లు వేశారు. లంకలకోడేరు పీహెచ్‌సీ వైద్యాధికారులు అడ్డాల ప్రతాప్‌కుమార్, నవ్యజీవన్, ఆరోగ్య విస్తరణాధికారి గుడాల హరిబాబు పాల్గొన్నారు.
భీమవరం రూరల్/వీరవాసరం, మార్చి 3:పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం 24వ వార్డులోని యూపీహెచ్‌సీ స్కూల్‌లో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ చిన్నారులకు పోలియోచుక్కలు వేశారు. ఆయన మాట్లాడుతూ ప్రతీ తల్లి కూడా తమ బిడ్డలకు పోలియో చుక్కలు వేయించుకోవాలన్నారు. వీరవాసరం మండలంలో వీరవాసరం పీహెచ్‌సీలో ఆదివారం ఆదివారం పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ఎంపీపీ వీరవల్లి దుర్గాభవాని ప్రారంభించారు. వీరవాసరం పీహెచ్‌సీ పరిధిలో 5,195 మందికి 4,935 మందికి చుక్కలు వేశారు. మిగిలిన పిల్లలకు సోమ, మంగళవారాలు ఇంటింటా సర్వే నిర్వహించి లక్ష్యాలను పూర్తిచేస్తామని వైద్యాధికారులు తెలిపారు. డాక్టర్ ఎస్.మోహాసినాతాజ్, డాక్టర్ హర్షిత, సీహెచ్‌వో ఎ.దేవదాసు తదితరులు పాల్గొన్నారు.
నరసాపురం టౌన్/మొగల్తూరు, మార్చి3 : పోలియో రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు పిలుపునిచ్చారు. పట్టణంలోని కొప్పర్తి కాంప్లెక్ ్సలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని ఆయన ప్రారంభించి, చిన్నారులకు చుక్కల మందు వేశారు. చైర్‌పర్సన్ వెంకటరమణ, కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, సత్యవతి, ఠాగూర్, కావలి నాని తదితరులు పాల్గొన్నారు. మొగల్తూరు మండలంలో 97 శాతం పల్స్ పోలియో చుక్కలు వేశామని వైద్యాధికారి దినేష్ తెలిపారు. మండలంలో 5,531 మంది చిన్నారులకు 5,397 మందికి పోలియో చుక్కలు వేశామన్నారు. మండలంలో 53 బూత్‌లు, ఒక మొబైల్ టీమ్, ముత్యాలపల్లి బండి ముత్యాలమ్మ ఆలయం వద్ద ఒక ట్రాన్సిట్ టీమ్ ద్వారా చిన్నారులకు చుక్కలు వేశామన్నారు.
ఆచంట/పెనుగొండ/పోడూరు, మార్చి3 : ఆచంట మండలం వల్లూరు వేమవరం పీహెచ్‌సీలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఎంపీపీ దిగుమర్తి సూర్యకుమారి ప్రారంభించారు. మండలంలో 94శాతంపైనే చిన్నారులకు పోలియో చుక్కలు వేశామని వైద్యాధికారులు తెలిపారు. పెనుగొండ మండలం పెనుగొండలో సర్పంచ్ నక్కా శ్యామలా సోని వైదాయధికారులతో కలిసి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. స్థానిక పంచాయతీ,బస్టాండ్, గ్రామ కచేరి, వేండ్రవారి వీధి, జడ్పీ హైస్కూలు, రామచంద్రరావు పేట, రాజుగూడెంలలో సెంటర్లలో పోలియో చుక్కలు వేశారు. పోడూరు మండలంలో 3,654 మంది చిన్నారులకు గాను 3,507 మందికి చుక్కలు వేశారు. 96 శాతం మందికి పోలియో చుక్కలు వేశామని పోడూరు పీహెచ్‌సీ వైద్యాధికారిణి మణిత్యాగి తెలిపారు. కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణాధికారి వి.సత్యనారాయణ, వైద్యసిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
Updated Date - Mar 03 , 2024 | 11:56 PM