చేసిన పనులకు బిల్లులు చెల్లించండి
ABN, Publish Date - Mar 03 , 2024 | 12:33 AM
పంచాయతీ ద్వారా కాంట్రా క్టర్లు చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని పంచాయతీ కార్యదర్శులను, సర్పంచ్‌లను జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాథ్ ఆదేశించారు.
డీపీవో శ్రీనివాస విశ్వనాథ్
కామవరపుకోట, మార్చి 2 : పంచాయతీ ద్వారా కాంట్రా క్టర్లు చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని పంచాయతీ కార్యదర్శులను, సర్పంచ్‌లను జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాథ్ ఆదేశించారు. తడికలపూడి సచివాలయం వద్ద జరిగిన సమావేశంలో శనివారం ఆయన మాట్లాడుతూ పంచాయతీల్లో పేరుకుపోయిన కరెంటు బకాయిలను చెల్లించాలన్నారు. 2022–23 ఆర్థిక సంవత్సరానికి 15వ ఆర్థిక సంఘం నిధులు రెండు విడతలుగా 545 పంచా యతీలకు రూ.31 కోట్ల 65 లక్షలు జమ అయ్యాయన్నారు. 2023–24 ఆర్థిక సంవత్సరానికి మొదటి విడతగా రూ.32 కోట్లు జమ అయ్యాయని, ఈ నిధుల్లో కేవలం రూ.32 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, రూ.31 కోట్లు పైబడి ఖర్చు చేయా ల్సి ఉందన్నారు. జిల్లాలో రూ.137 కోట్లు మేరకు విద్యుత్ బకాయిలు చెల్లించాల్సి ఉండగా రూ.54 లక్షలు మాత్రమే పంచాయతీలు చెల్లించాయన్నారు. పంచాయతీ ఖాతాల్లో నిధులు ఉన్నందున చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని సూచించారు. వేసవి నేపథ్యంలో ఎక్కడా తాగునీటి సమస్య లేకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆయన వెంట ఈవో పీఆర్డీ జి.మరిడయ్య, కామవరపుకోట, తడికలపూడి పంచా యతీ కార్యదర్శులు జి.డి.వి.శ్రీనివాసరావు, జి.వి.సత్యనారా యణ, తడికలపూడి సర్పంచ్ కొత్తపల్లి రజనీ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
Updated Date - Mar 03 , 2024 | 12:33 AM