ముగిసిన ఖాదర్ బాబా గంథ మహోత్సవం
ABN, Publish Date - Feb 22 , 2024 | 11:44 PM
నగరంలోని బాబా మెట్ట వద్ద గల ఖాదర్‌బా బా దర్గాలో జరుగుతున్న 65వ గంథ మహోత్సవా లు గురువా రంతో ముగి శాయి. మూ డు రోజుల పాటు ఘనంగా జరిగిన ఈ ఉత్సవాల్లో దేశం నలు మూలల నుంచి సూఫీ భక్తులు పాల్గొన్నారని ఖలీలుల్లా షరీఫ్ (ఖలీలుబాబు) చెప్పారు. విచ్చేసిన భక్తులు దర్గాలో సుగంధ, చాదర్ సమర్పించి తమ మొక్కులు చెల్లించుకు న్నా రని తెలిపారు.
విజయనగరం (ఆం ధ్రజ్యోతి), ఫిబ్ర వరి 22: నగరంలోని బాబా మెట్ట వద్ద గల ఖాదర్‌బా బా దర్గాలో జరుగుతున్న 65వ గంథ మహోత్సవా లు గురువా రంతో ముగి శాయి. మూ డు రోజుల పాటు ఘనంగా జరిగిన ఈ ఉత్సవాల్లో దేశం నలు మూలల నుంచి సూఫీ భక్తులు పాల్గొన్నారని ఖలీలుల్లా షరీఫ్ (ఖలీలుబాబు) చెప్పారు. విచ్చేసిన భక్తులు దర్గాలో సుగంధ, చాదర్ సమర్పించి తమ మొక్కులు చెల్లించుకు న్నా రని తెలిపారు. సూఫీ పరంపర కొనసాగాలని, మహానీయులను స్మరించుకుంటూ విశ్వశాంతి కోసం దర్గాలో ప్రార్థనలు చేశారని తెలిపారు. గంఽథ మ హోత్సవాలు ముగింపు సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకుడు అశోక్ గజపతిరాజు, జడ్పీ చైర్‌పర్సన్ మజ్జి శ్రీనివాసరావు, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, నగర పాలక సంస్థ మేయర్ వీవీ లక్ష్మీ, టీడీపీ నేతలు పిళ్లా విజయ్‌కుమార్, అవనాపు విజ య్ తదితరులు పాల్గొని, బాబాకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి చాదర్, సుగంధ పుష్పాలు, చందనం సమర్పించారు.
విజయనగరం దాసన్నపేట: ఖాదర్‌బాబా దర్గాని జనసేన నాయకులు గురాన అయ్యలు, చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరిసహస్ర, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిటీ చైర్మన్ కేసలి అప్పారావులు గురువారం దర్శించు కున్నారు. దర్బార్ నిర్వహకులు మహ్మద్ ఖలీలుల్లా షరీఫ్ వీరికి దర్గా ఆచారం మేరకు శాలువాతో సత్కరించారు.
Updated Date - Feb 22 , 2024 | 11:44 PM