ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కొఠియాలో ఎస్పీ పర్యటన

ABN, Publish Date - Mar 01 , 2024 | 11:45 PM

కొఠియా గ్రూప్‌లో పోలింగ్‌కు ఎప్పుడు సమస్య వచ్చిందని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ ఆరా తీశారు. శుక్రవారం కొఠియా గ్రూప్‌ గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేశారు.

నేరేళ్లవలస పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకుంటున్న ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌

సమస్యలపై ఆరా

సాలూరు /రూరల్‌/ మక్కువ, మార్చి 1 : కొఠియా గ్రూప్‌లో పోలింగ్‌కు ఎప్పుడు సమస్య వచ్చిందని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ ఆరా తీశారు. శుక్రవారం కొఠియా గ్రూప్‌ గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేశారు. నేరేళ్లవలసలో ఏపీ పోలింగ్‌ బూత్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా కొఠియా గ్రూప్‌ గ్రామాల ప్రజలు.. ఏపీ ఎన్నికల్లో ఓటు వేసే క్రమంపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గతంలో ఇరు రాష్ట్రాల ఎన్నికలకు పోలింగ్‌ సజావుగా జరగ్గా, ఏపీ పోలింగ్‌కు ఎప్పుడు సమస్య వచ్చిందని కొఠియా సీఐ నారాయణరావు, ఎస్‌డీఎక్స్‌ సీఐ రోహిణిపతిలను ప్రశ్నించారు. 2019 ఎన్నికలకు ఎటువంటి అవరోధాలు కలగలేదని వారు వివరించారు. పరిషత్‌, పంచాయతీ ఎన్నికల సమయంలో సమస్య ఏర్పడిందన్నారు. దానిపై ఒడిశా సుప్రీంకోర్టుకు వెళ్లడం, అక్కడి ప్రజాప్రతినిధులు మూకమ్మడిగా తరలిరావడం తదితర విషయాలను వివరించారు. అనంతరం కొఠియా గ్రూప్‌ పరిధిలో ఏర్పాటు చేస్తున్న శిఖపరువు, డొంకల వెలగవలస పోలింగ్‌ బూత్‌లకు సంబంధించి ఏ గ్రామాల ప్రజలు ఓట్లు వేయనున్నారు? ఏయే మార్గాల్లో రానున్నారు? అని ఎస్పీ ప్రశ్నించారు. వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఎగువశెంబి, కొఠియా, ముడకారు, డోలియాంబ, పట్టుచెన్నారు, పగులుచెన్నారు తదితర కొఠియా గ్రూప్‌ గ్రామాలను ఆయన పరిశీలించారు.

- మక్కువ పోలీసు స్టేషన్‌ను కూడా ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ సందర్శించారు. స్టేషన్‌ పరిసరాలు, రికార్డులు నిశితంగా పరిశీలించారు. రాత్రి వేళల్లో గస్తీని పక్కాగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఉపేక్షించొద్దని తెలిపారు. పరిశీ లించారు. ఆయన వెంట సాలూరు సీఐ బాలకృష్ణ, ఎస్‌ఐ పి.నరసింహమూర్తి తదితరులు ఉన్నారు.

Updated Date - Mar 01 , 2024 | 11:45 PM

Advertising
Advertising