జాయింట్ కలెక్టర్‌గా శోభిక
ABN, Publish Date - Mar 03 , 2024 | 12:12 AM
జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ఎస్‌ఎస్ శోభిక నియామకమయ్యారు. ఆమె ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. బదిలీపై జేసీగా జిల్లాకు రానున్నారు.
జేసీ శోభిక
పార్వతీపురం, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ఎస్‌ఎస్ శోభిక నియామకమయ్యారు. ఆమె ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. బదిలీపై జేసీగా జిల్లాకు రానున్నారు. సోమవారం బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. గతంలో ఇక్కడ జేసీగా పనిచేసిన గోవిందరావుకు బదిలీ జరిగ్గా, ఆయన స్థానంలో అంబేడ్కర్ నియామకమయ్యారు. కానీ ఆయన అనారోగ్య కారణాలతో సెలవు పెట్టడంతో జేసీగా ఎస్‌ఎస్ శోభిక నియామకమయ్యారు.
Updated Date - Mar 03 , 2024 | 12:12 AM