ప్రజా సంక్షేమమే ధ్యేయం: కోండ్రు మురళీమోహన్
ABN, Publish Date - Feb 25 , 2024 | 12:23 AM
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతానని రాజాం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ స్పష్టం చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శనివారం ప్రకటించిన తొలిజాబితాలో టికెట్ పొందిన కోండ్రుతో ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. చంద్రబాబు నోటి వెంట నాపేరు వినడం చాలా సంతోషంగా ఉందని, బాధ్యతగా పనిచేసి అందర్నీ కలుపుకుని పనిచేస్తానని తెలిపారు. రాజాంలో విజయం సాధించి చంద్రబాబుకు బహుమతిగా ఇస్తాన న్నారు. నియోజకవర్గంలో టీడీపీ గాలి వీస్తోందని తెలిపారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రజలు తమ పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అధికార పార్టీ వైఫల్యాలపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. తాను గతంలో మంత్రిగా నియోజకవర్గానికి సుమారు రూ.500 కోట్లు నిధులు మంజూరు చేయించానని, తాగునీటి ఎద్దడి లేకుండా రక్షిత మంచినీటి పథకాలు, రహదారుల నిర్మించానరి సాగునీటి వనరుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చానని చెప్పారు. అధికార పార్టీ మాయమాటలు నమ్మి మరోమారు మోసపోవద్దని కోరారు. సంక్షేమ పఽథకాలు ప్రతి ఇంటికీ టీడీపీతోనే చేరుతాయని తెలిపారు.
రాజాం రూరల్: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతానని రాజాం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ స్పష్టం చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శనివారం ప్రకటించిన తొలిజాబితాలో టికెట్ పొందిన కోండ్రుతో ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. చంద్రబాబు నోటి వెంట నాపేరు వినడం చాలా సంతోషంగా ఉందని, బాధ్యతగా పనిచేసి అందర్నీ కలుపుకుని పనిచేస్తానని తెలిపారు. రాజాంలో విజయం సాధించి చంద్రబాబుకు బహుమతిగా ఇస్తాన న్నారు. నియోజకవర్గంలో టీడీపీ గాలి వీస్తోందని తెలిపారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రజలు తమ పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అధికార పార్టీ వైఫల్యాలపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. తాను గతంలో మంత్రిగా నియోజకవర్గానికి సుమారు రూ.500 కోట్లు నిధులు మంజూరు చేయించానని, తాగునీటి ఎద్దడి లేకుండా రక్షిత మంచినీటి పథకాలు, రహదారుల నిర్మించానరి సాగునీటి వనరుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చానని చెప్పారు. అధికార పార్టీ మాయమాటలు నమ్మి మరోమారు మోసపోవద్దని కోరారు. సంక్షేమ పఽథకాలు ప్రతి ఇంటికీ టీడీపీతోనే చేరుతాయని తెలిపారు.
సంకిలిలో కోండ్రుకు అభినందన
రేగిడి: రాజాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ కోండ్రు మురళీ మోహన్‌కు లభించడంతో శనివారం సంకిలిలో పార్టీ నాయకులు, గ్రామస్థులు అభి నందించారు. పాలకొండ దుర్గమాతను దర్శించుకొని రాజాం వెళ్తుండగా మార్గమధ్యలో ఆయనతో దూబ ధర్మారావు, అశోక్‌బాబు, జి. ధనంజయ్, గురవాన రమేష్, నాగభూషనరావు, సంకిలిక్యాడర్ కర్రి రమణ, గంగు కృష్ణారావు, నక్క రమణ మాట్లాడారు.
Updated Date - Feb 25 , 2024 | 12:23 AM