బొబ్బిలిలో మరో షాక్
ABN, Publish Date - Mar 04 , 2024 | 12:24 AM
బొబ్బిలి నియోజక వర్గంలో వైసీపీకి మరోషాక్ తగిలింది. మండల ంలోని ఎం.బూర్జివలస ఎంపీటీసీ గునుపూరు దేవి, ఆమె భర్త శ్రీనివాసరావులు తమ అనుచరులతో కలిసి ఆదివారం వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.
బొబ్బిలిలో మరో షాక్
ఎం.బూర్జివలస ఎంపీటీసీ టీడీపీలో చేరిక
మండల పరిషత్‌లో వైసీపీకి తగ్గిన బలం
బొబ్బిలి, మార్చి 3: బొబ్బిలి నియోజక వర్గంలో వైసీపీకి మరోషాక్ తగిలింది. మండల ంలోని ఎం.బూర్జివలస ఎంపీటీసీ గునుపూరు దేవి, ఆమె భర్త శ్రీనివాసరావులు తమ అనుచరులతో కలిసి ఆదివారం వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. స్థానిక దర్బారు మహల్‌లో టీడీపీ-జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బేబీనాయన, మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు సమక్షంలో పార్టీ తీర్థం స్వీకరిం చారు. ఆ దంపతులతో పాటు సుమారు 30 కుటుంబాల వారు పార్టీ మారారు. వారందరికీ బేబీనాయన, తెంటు పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తలు సింగిరెడ్డి వెంకటరమణ, బెవర బలరాం, కర్రి చిన్నం నాయుడు, గొర్లె రామారావు, చొక్కాపు ఉమాదేవి, దాసరి భాగ్యలక్ష్మి, గేదెల సింహా చలమ్మ, గొర్లె అప్పలనాయుడు తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అల్లాడ భాస్కరరావు, మండల అధ్యక్షుడు వాసిరెడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు.
మండల పరిషత్‌లో అలజడి
ఫ వైసీపీ ఆధీనంలో ఉన్న బొబ్బిలి మండల పరిషత్ పాలకవర్గంలో అధికార పార్టీ ఎంపీటీసీల బలం పడిపో యింది. మొత్తం మండలంలో 19 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వాటిలో పది వైసీపీ, 9 స్ధానాలు తెలుగుదేశం పార్టీలు గెలుచుకున్నాయి. దీంతో మండల పరిషత్ అధ్యక్ష పదవిని ఎమ్మెల్యే శంబంగి వెంకటచిన అప్పలనాయుడు స్వయానా మరదలు అయిన శంబంగి లక్ష్మీవేణుగోపాలనా యుడు కైవసం చేసుకున్నారు. ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ బలం తారుమారైంది. అల జంగి గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ రెండు పదవులను రేజేటి భద్రమ్మ గెలుచుకున్నారు. ఏదో ఒక పదవికి మాత్రమే పరిమితం కావాలన్న నిబంధన ఉండడంతో భద్రమ్మ ఎంపీటీసీ పదవికి గత ఏడాది రాజీనామా చేసి అలజంగి గ్రామ సర్పంచ్‌గా కొనసాగుతున్నారు. ఇటీవల ఆమె తమ అనుచరులతో కలిసి వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిపోయిన సంగతి తెలిసిందే. భద్రమ్మ ఎంపీటీసీ పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో బొబ్బిలి మండలపరిషత్‌లో 18 మంది ఎంపీటీసీలు ఉన్నారు. తెలుగుదేశం-వైసీపీ చెరిసగం చొప్పున ఎంపీటీసీలు కలిగి ఉన్నాయి. తాజాగా ఎం.బూర్జివలస గ్రామానికి చెందిన వైసీపీ ఎంపీటీసీ గునుపూరు దేవి ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరిపోవడంతో మండల పరిషత్ పాలకవర్గంలో అధికార పార్టీ పూర్తిగా మైనార్టీలో పడిపోయింది.
Updated Date - Mar 04 , 2024 | 12:24 AM