మరిడిమాంబ ఆలయంలో చోరీ
ABN, Publish Date - Mar 01 , 2024 | 12:37 AM
మాడుగుల శివారు ఖండివరం వెళ్లే మార్గం పంటపొలాల మధ్యలో ఉన్న మరిడిమాంబ ఆలయంలో బుధవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. ఆలయ నిర్వాహకులు ఎప్పటిలాగానే బుధవారం సాయంత్రం అమ్మవారి ఆలయానికి తలుపులు వేసి వెళ్లిపోగా, అర్ధరాత్రి సమయంలో ఆలయం ఉత్తరం వైపుగా ఉన్న గేట్ల తాళాలను దొంగలు పగులగొట్టి ఆలయంలోకి ప్రవేశించారు.
అమ్మవారి ఆభరణాల అపహరణ
హుండీలు పగులగొట్టి నగదు తస్కరణ
సీసీ కెమెరాలు ధ్వంసం
మాడుగుల, ఫిబ్రవరి 29: మాడుగుల శివారు ఖండివరం వెళ్లే మార్గం పంటపొలాల మధ్యలో ఉన్న మరిడిమాంబ ఆలయంలో బుధవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. ఆలయ నిర్వాహకులు ఎప్పటిలాగానే బుధవారం సాయంత్రం అమ్మవారి ఆలయానికి తలుపులు వేసి వెళ్లిపోగా, అర్ధరాత్రి సమయంలో ఆలయం ఉత్తరం వైపుగా ఉన్న గేట్ల తాళాలను దొంగలు పగులగొట్టి ఆలయంలోకి ప్రవేశించారు.
అమ్మవారి మెడలోని వెండి హారం, చెవిదుద్దులు అపహరించారు. అలాగే అమ్మవారి ఆలయంలో గల రెండు హుండీలను విరగ్గొట్టి అందులో నగదు అపహరించి ఆ హుండీలను ఆలయ సమీపంలో పడేశారు. అయితే గతంలో ఇదే మాదిరిగా చోరీ జరగడంతో అప్రమత్తమైన కమిటీ సభ్యులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అయితే దొంగలు సీసీ కెమెరాలను ధ్వంసం చేయడంతో పాటు హార్డ్ డిస్క్, మానెటర్‌ను కూడా పట్టుకుపోయారు. కమిటీ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ దామోదరనాయుడు తెలిపారు.
Updated Date - Mar 01 , 2024 | 12:37 AM