ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఎన్నికల్లో నోడల్‌ అధికారుల పాత్ర కీలకం

ABN, Publish Date - Mar 06 , 2024 | 11:26 PM

ఎన్నికల నిర్వహణలో నోడల్‌ అధికారుల పాత్ర ఎంతో కీలకమని కలెక్టర్‌ విజయసునీత అన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం రాత్రి నోడల్‌ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో రవాణా పరంగా అనేక సవాళ్లున్నాయని, వాటిని అధిగమించాలన్నారు.

ఎన్నికలపై నోడల్‌ అధికారులతో సమావేశమైన విజయసునీత

కలెక్టర్‌ విజయసునీత

పాడేరు, మార్చి 6(ఆంధ్రజ్యోతి): ఎన్నికల నిర్వహణలో నోడల్‌ అధికారుల పాత్ర ఎంతో కీలకమని కలెక్టర్‌ విజయసునీత అన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం రాత్రి నోడల్‌ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో రవాణా పరంగా అనేక సవాళ్లున్నాయని, వాటిని అధిగమించాలన్నారు. అన్ని శాఖలకు చెందిన అధికారులు నోడల్‌ అధికారులుగా వున్నారన్నారు. ఎన్నికల విధుల్లో ఎదురయ్యే పరిస్థితులను చాకచక్యంగా అధిగమిస్తూ ఎన్నికల విధుల్లో మరింత చొరవ, భాగస్వామ్యం కావాలన్నారు. ఎన్నికల కమిషన్‌ నుంచి ఎప్పటికప్పుడు వచ్చే సూచనలపై ఎన్నికల బృందాలకు అవగాహన కల్పించాలన్నారు. మేన్‌పవర్‌పై సంపూర్ణ అవగాహనతో డేటాను రూపొందించాలని, సక్రమంగా వినియోగించుకోవాలని, అవసరమైన శిక్షణలు ఇవ్వాలన్నారు. ఎన్నికల సామగ్రి పంపిణీ జరిగిన తరువాత నేరుగా పోలింగ్‌ కేంద్రానికి చేరాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యలో ఆగకూడదన్నారు. నోడల్‌ అధికారులు తమ పాత్రను సమర్థవంతంగా నిర్వర్తించి ఎన్నికలను విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ పి.అంబేడ్కర్‌, నోడల్‌ అధికారులు కె.అప్పారావు, లీలాప్రసాద్‌, కె.సునీల్‌కుమార్‌, వి.మురళి, పి.గోవిందరాజులు, సువర్ణఫణి, ఎస్‌బీఎస్‌.నంద్‌, రమేశ్‌కుమార్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 06 , 2024 | 11:26 PM

Advertising
Advertising