5, 7 తేదీల్లో సీఎం రాక
ABN, Publish Date - Mar 03 , 2024 | 01:32 AM
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఈనెల ఐదు, ఏడు తేదీల్లో నగరానికి రానున్నారు.
5న నగరంలో పారిశ్రామిక సదస్సు
7న అనకాపల్లిలో ‘చేయూత’ కార్యక్రమం
విశాఖపట్నం, మార్చి 2 (ఆంధ్రజ్యోతి):
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఈనెల ఐదు, ఏడు తేదీల్లో నగరానికి రానున్నారు. ఈనెల ఐదో తేదీన ‘విజన్ వైజాగ్’ పేరుతో భీమిలి బీచ్‌రోడ్డులోని రాడిసన్ హోటల్‌లో పారిశ్రామికవేత్తలతో నిర్వహించనున్న సదస్సులో ఆయన పాల్గొంటారు. అనంతరం స్కిల్ డెవల్‌పమెంట్, ఉపాధి కల్పన శాఖ పీఎం పాలెంలోని వి.కన్వెన్షన్ హాలులో నిర్వహించనున్న కార్యక్రమానికి సీఎం హాజరవుతారు. అలాగే ఈనెల ఏడో తేదీన మరోమారు సీఎం విశాఖ రానున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో నగరానికి చేరుకుని, విమానాశ్రయం నుంచి నేరుగా అనకాపల్లి వెళతారు. ‘చేయూత’ పథకం నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొంటారు. ఈనెల ఐదో తేదీన నగరంలో సీఎం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను కలెక్టర్ మల్లికార్జున, సీపీ రవిశంకర్ అయ్యన్నార్, జీవీఎంసీ కమిషనర్ సాయికాంతవర్మ, జేసీ మయూర్ అశోక్, ఇతర అధికారులు శనివారం పరిశీలించారు.
Updated Date - Mar 03 , 2024 | 01:32 AM