ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

పర్యాటకుల కోలాహలం

ABN, Publish Date - Feb 04 , 2024 | 11:45 PM

మన్యంలోని సందర్శనీయ ప్రాంతాల్లో పర్యాటకుల సందడి నెలకొంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతుండడం, మంచు అందాలకు ప్రకృతి సోయగాలు మరింత ద్విగుణీకృతం కావడంతో అధిక సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు.

చెరువులవేనం వద్ద మంచు అందాలను తిలకిస్తున్న పర్యాటకులు

బొర్రా గుహలు మొదలుకుని లంబసింగి వరకు రద్దీ

(ఆంధ్రజ్యోతి- పాడేరు)

మన్యంలోని సందర్శనీయ ప్రాంతాల్లో పర్యాటకుల సందడి నెలకొంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతుండడం, మంచు అందాలకు ప్రకృతి సోయగాలు మరింత ద్విగుణీకృతం కావడంతో అధిక సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు. ఆదివారం అనంతగిరి మండలం బొర్రా గుహలు మొదలుకుని చింతపల్లి మండలం లంబసింగి వరకు పర్యాటకుల సందడి కొనసాగింది.

ప్రస్తుతం ఏజెన్సీలో చలి ప్రభావం, పొగమంచు కొనసాగుతుండడమే సందర్శకుల తాకిడికి కారణమని తెలుస్తున్నది. కాగా అనంతగిరి మండలం బొర్రా గుహలు, కటికి, తాడిగుడ జలపాతాలు, అరకులోయ మండలంలో మాడగడ మేఘాల కొండ, గిరిజన మ్యూజియం, పద్మాపురం గార్డెన్‌, కొత్తవలస వ్యవసాయ క్షేత్రం, పెదలబుడు గిరిజన గ్రామదర్శిని, డుంబ్రిగుడ మండలంలోని చాపరాయిగెడ్డ, పెదబయలు మండలంలో తారాబు జలపాతం, పాడేరు మోదకొండమ్మ ఆలయం, వంజంగి హిల్స్‌, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, చింతపల్లి మండలంలో తాజంగి, చెరువువేనం, లంబసింగి ప్రాంతాలను పర్యాటకులు అధిక సంఖ్యలో సందర్శించారు.

వంజంగి మేఘాల కొండ వద్ద..

పాడేరు రూరల్‌: జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన వంజంగి మేఘాల కొండకు పర్యాటకులు ఆదివారం పోటెత్తారు. దూర ప్రాంతాల నుంచి శనివారం రాత్రే పాడేరు చేరుకుని, ఆదివారం వేకువజామున వంజంగి మేఘాల కొండకు వచ్చారు. ఇక్కడ మంచు అందాలను ఆస్వాదించారు.

లంబసింగి వద్ద..

చింతపల్లి: ఆంధ్ర కశ్మీర్‌ లంబసింగికి పర్యాటకుల తాకిడి భారీగా పెరిగింది. పర్యాటక సీజన్‌ ముగుస్తుండడంతో ప్రకృతి అందాలను వీక్షించేందుకు పలు రాష్ట్రాల నుంచి పర్యాటకులు లంబసింగికి క్యూ కడుతున్నారు. ఆదివారం లంబసింగికి వేల సంఖ్యలో పర్యాటకులు వచ్చారు. దీంతో ఉదయం నుంచే లంబసింగి, చెరువులవేనం, తాజంగి జలాశయం వద్ద సందడి ప్రారంభమైంది. చెరువులవేనం వ్యూపాయింట్‌ వద్ద పచ్చని కొండలు, దానిని తాకుతూ పయనించే మంచు మేఘాలను తిలకించి పరవశించారు. చెరువులవేనం ప్రకృతి అందాలను కెమెరాల్లో బంధించేందుకు సందర్శకులు పోటీ పడ్డారు. సాయంత్రం వరకు లంబసింగి పరిసర పర్యాటక ప్రాంతాలు సందర్శకులతో రద్దీగా కనిపించాయి.

Updated Date - Feb 04 , 2024 | 11:45 PM

Advertising
Advertising