ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వికసిత్‌ ఆంధ్రా-2047 డాక్యుమెంట్‌ అద్భుతం: సీఎస్‌

ABN, Publish Date - Feb 29 , 2024 | 03:31 AM

ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు వికసిత్‌ ఆంధ్రా-2047పై నీతి ఆయోగ్‌ రూపొందించిన విజన్‌ డాక్యుమెంట్‌ అద్భుతంగా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి అన్నారు. బుధవారం అమరావతి

అమరావతి, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు వికసిత్‌ ఆంధ్రా-2047పై నీతి ఆయోగ్‌ రూపొందించిన విజన్‌ డాక్యుమెంట్‌ అద్భుతంగా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి అన్నారు. బుధవారం అమరావతి సచివాలయంలో వికసిత్‌ ఆంధ్రా-2047పై ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ సందర్బంగా సీఎస్‌ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లు అవుతున్న సందర్భంగా అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను తీర్చిదిద్ధే లక్ష్యంలో ఏపీని కూడా 2047నాటికి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దే కృషికి ఈ విజన్‌ డాక్యుమెంట్‌ దోహదపడుతుందన్నారు. పరిశ్రమలు, ఇంధన, వ్యవసాయ, మౌలిక సదుపాయాలు, సేవలు, గ్రీన్‌ ఎకానమీ నగరాల అభివృద్ధి వంటి అంశాల్లో రాష్ట్రాభివృద్ధికి ఈ డాక్యుమెంట్‌ అమలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దేశంలో రెండో పెద్ద తీరప్రాంతాన్ని కలిగిన ఏపీలో ఓడరేవులతో పాటు పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. ఈ డాక్యుమెంట్‌పై సీఎంకు ప్రజెంటేషన్‌ ఇచ్చి, దీని అమలుకు ఆమోదం తీసుకోనున్నట్టు వివరించారు.

Updated Date - Feb 29 , 2024 | 03:31 AM

Advertising
Advertising