ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Nara Lokesh : ప్రిజనరీకి విజనా?

ABN, Publish Date - Mar 08 , 2024 | 04:01 AM

ప్రిజనరీ జగన్‌కు విజన్‌ ఉందని చెప్పడం ప్రపంచ ఎనిమిదో వింతని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ దుయ్యబట్టారు. గంజాయి, ఇసుక అక్రమ రవాణాలో ఆయనకు విజన్‌ ఉందన్నారు. ‘ఆయన

శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో జరిగిన శంఖారావం సభకు హాజరైన జనం, ప్రసంగిస్తున్న లోకేశ్‌

ఇది ప్రపంచంలో ఎనిమిదో వింత: లోకేశ్‌

జగన్‌ చూపిన డిజైన్‌.. కోడికత్తి గ్రాఫిక్‌

విశాఖలో బస్‌షెల్టర్‌ కడితే

గట్టి గాలికే కూలిపోయింది

ఫ్లోటింగ్‌ బ్రిడ్జి ఒక్క రోజులోనే

చిత్తూరును పెద్దిరెడ్డి దోచేశారు

ఇప్పుడు సత్యసాయిపై కన్నేశారు

గనులు, ఇసుక మింగేస్తారు

అందరి జాతకాలూ రెడ్‌బుక్‌లో

మొదట జైలుకెళ్లేది పాపాల పెద్దిరెడ్డే

తల్లికి, చెల్లికే న్యాయం చేయలేదు

ఈ సీఎం ప్రజలకేం చేస్తాడు?

టీడీపీ-జనసేన మధ్య చిచ్చుకు యత్నం

వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి

శంఖారావం సభల్లో యువ నేత పిలుపు

పుట్టపర్తి, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): ప్రిజనరీ జగన్‌కు విజన్‌ ఉందని చెప్పడం ప్రపంచ ఎనిమిదో వింతని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ దుయ్యబట్టారు. గంజాయి, ఇసుక అక్రమ రవాణాలో ఆయనకు విజన్‌ ఉందన్నారు. ‘ఆయన గ్రాఫిక్స్‌తో కొత్త భవనాన్ని చూపించాడు. ఒక డిజైన్‌ చూపిస్తే నేనే ఆశ్చర్యపోయా. దానిపై ఆరాతీస్తే అది కోడికత్తి గ్రాఫిక్‌ అని తేలింది’ అని ఎద్దేవా చేశారు. శంఖారావం యాత్రలో భాగంగా లోకేశ్‌ గురువారం శ్రీసత్యసాయి జిల్లాలో పర్యటించారు. హిందూపురం, మడకశిర, పెనుకొండ నియోజకవర్గాల పరిధిలో ఏర్పాటు చేసిన సభల్లో ప్రసంగించారు. ‘జగన్‌ పాలనలో విశాఖలో బస్‌షెల్టర్‌ కట్టారు. అది గట్టిగా గాలి వీస్తే కూలిపోయింది. ఫ్లోటింగ్‌ బ్రిడ్జి కడితే ఒక్క రోజులోనే పోయింది. విశాఖకు పరిశ్రమలంటూ సీఎం రోతపత్రిక కార్యాలయం నుంచి గ్రాఫిక్స్‌ పంపుతున్నారు. కోడికత్తి తప్ప.. వైసీపీ పాలకులకు ఏం తెలుసు’ అని మండిపడ్డారు. చిత్తూరు జిల్లాను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లూటీ చేశారని, ఇప్పుడు శ్రీసత్యసాయి జిల్లాపై కన్నేశారని చెప్పారు. ఇక్కడ కూడా లూటీ చేస్తారని, ఇసుక, మద్యం, గనులు మొత్తం తీసుకెళ్తారని.. ఆయన ఇక్కడకు వస్తే తరిమికొట్టాలని పిలుపిచ్చారు. రాష్ట్రంలో 26 వేల మంది బీసీలపై దాడులు జరిగాయని, చట్టాన్ని ఉల్లంఘించి ఇబ్బంది పెట్టిన అధికారులను వదిలిపెట్టనని, అందరి పేర్లు రెడ్‌బుక్‌లో ఉన్నాయని.. అందులో మొదట జైలుకు పంపేది పాపాల పెద్దిరెడ్డినేనని స్పష్టం చేశారు. తనపై 22 కేసులు పెట్టారని, ఎస్టీ, ఎస్సీ అట్రాసిటీ మొదలుకుని హత్యాయత్నం సెక్షన్ల కింద కూడా నమోదు చేశారని అన్నారు. అయినా ఏమీ చేయలేకపోయారని అన్నారు. టీడీపీ, జనసేన మధ్య చిచ్చుపెట్టేందుకు వైసీపీ పేటీఎం బ్యాచ్‌ ప్రయత్నిస్తోందని, దీనిని గుర్తించి రెండు పార్టీల శ్రేణులు తిప్పికొట్టాలని కోరారు. సైకో జగన్‌ను ఏపీ నుంచి తరిమికొట్టాలన్నారు.

బాబాయ్‌ని లేపేసింది..!

సొంత తల్లికి, చెల్లికి న్యాయం చేయని సీఎం జగన్‌.. ప్రజలకు ఏం చేస్తారని లోకేశ్‌ ప్రశ్నించారు. బాబాయ్‌ వివేకానందరెడ్డిని లేపేసింది జగన్‌రెడ్డి, ఎంపీ అవినాశ్‌రెడ్డి, భాస్కరరెడ్డి కాదా అని నిలదీశారు. ‘ముందు గుండెపోటన్నారు. తర్వాత శవానికి కుట్లు వేశారు. హడావుడిగా అంత్యక్రియలు చేయాలని చూశారు. అప్పట్లో చంద్రబాబు చేతిలో గొడ్డలి పెట్టి నారాసుర రక్తచరిత్ర అన్నారు. అది అబద్ధమని తేలిపోయింది. ఇప్పుడు నిజం బయటకు వచ్చింది’ అని అన్నారు. జగన్‌ చెల్లి సునీత నిజాలను బహిర్గతం చేశారని చెప్పారు. హంతకులు పాలకులయ్యారని, జగన్‌కి ఓటు వేయవద్దని ఆయన ప్రజలకు పిలుపిచ్చారు. ‘టీడీపీ అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ప్రతి ఇంటికీ ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. ప్రతి రైతుకు ఆర్థిక సాయంగా ఏడాదికి రూ.20 వేలు చెల్లిస్తాం. 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1500 చొప్పున ఇస్తాం. ఎన్నికలకు ముందు తనకు బీసీలే బ్యాక్‌ బోన్‌ అని చెప్పిన జగన్‌.. అదే బీసీల వెన్ను విరిచారని మండిపడ్డారు. తొలిరోజు పర్యటన అనంతరం లోకేశ్‌ రాత్రికి పుట్టపర్తి చేరుకుని బసచేశారు. శుక్రవారం పుట్టపర్తి, కదిరి నియోజకవర్గాల్లో శంఖారావం సభల్లో పాల్గొంటారు.

Updated Date - Mar 08 , 2024 | 04:01 AM

Advertising
Advertising