ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

‘వెలిగొండ’ ప్రారంభం ఓ బూటకం!

ABN, Publish Date - Mar 08 , 2024 | 03:37 AM

వెలిగొండ ప్రాజెక్టును పూర్తి కాకుండానే ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్‌కు సిగ్గుండాలని టీడీపీ నేతలు మండిపడ్డారు. నమ్మి ఓట్లేసిన రైతులు, ప్రజలను ఆయన నిలువునా మోసం చేశారని ధ్వజమెత్తారు.

పూర్తికాని ప్రాజెక్టును ప్రారంభించిన సీఎంకు సిగ్గుండాలి

వెలిగొండ ప్రాజెక్టు వద్ద టీడీపీ నేతల ధ్వజం

రైతులను జగన్‌ మోసం చేశారని విమర్శ

పైలాన్‌ వద్ద చెవిలో పూలతో నిరసన

పెద్దదోర్నాల, మార్చి 7: వెలిగొండ ప్రాజెక్టును పూర్తి కాకుండానే ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్‌కు సిగ్గుండాలని టీడీపీ నేతలు మండిపడ్డారు. నమ్మి ఓట్లేసిన రైతులు, ప్రజలను ఆయన నిలువునా మోసం చేశారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి బుధవారం అట్టహాసంగా ప్రకాశం జిల్లాలో ప్రారంభించిన వెలిగొండ ప్రాజెక్టును గురువారం టీడీపీ ఎర్రగొండపాలెం ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు, మార్కాపురం ఇన్‌చార్జి కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతల బృందం సందర్శించింది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకపోవడం, అస్తవ్యస్తంగా ఉన్న కాలువలు, ఫీడర్‌ కెనాల్‌లోని ఊటనీరు సొరంగాల్లోకి రాకుండా వేసిన అడ్డుకట్టతదితరాలను పరిశీలించిన టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం ఆవిష్కరించిన పైలాన్‌ వద్ద చెవిలో పూలతో నిరసన తెలిపారు. బయటి నుంచి బిందెలతో నీరు తెచ్చి ప్రాజెక్టులో పోశారు. అనంతరం కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రాజెక్టు ప్రారంభమంతా బూటకమన్నారు. ఇదంతా రాజకీయ లబ్ధి కోసం జగన్‌ ఆడిన నాటకమని విమర్శించారు. ముంపు బాధితులకు పరిహారం చెల్లించకుండా, పునరావాసం కల్పించకుండా ఉత్తకుండను ప్రారంభించినందుకు జగన్‌ సిగ్గుపడాలని హితవు పలికారు. నిర్వాసితులు ప్రశ్నించకుండా పోలీసులతో కట్టడి చేశారన్నారు. గూడూరి ఎరిక్షన్‌బాబు మాట్లాడుతూ టీడీపీ హయాంలో నిర్వాసితులకు రూ.12లక్షలు ఇస్తామంటే, అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న ఇప్పటి మంత్రి సురేశ్‌, ఇతర వైసీపీ నాయకులు తాము అధికారంలోకి వస్తే రూ.18లక్షలు ఇస్తామంటూ నమ్మబలికి, తీరా అధికారంలోకి వచ్చాక మోసం చేశారని విమర్శించారు. ప్రాజెక్టు పనులకు టీడీపీ హయాంలో రూ.1,450 కోట్లు ఖర్చు చేస్తే వైసీపీ ప్రభుత్వం రూ.950 కోట్లు మాత్రమే వెచ్చించిందన్నారు. ప్రాజెక్టు పూర్తికి ఇంకా రూ.4వేల కోట్లు అవసరమని, నిర్వాసితులకు రూ.1,200 కోట్లు ఇవ్వాల్సి ఉందని తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో ప్రజలను మాయ చేస్తున్నారని విమర్శించారు.

Updated Date - Mar 08 , 2024 | 03:37 AM

Advertising
Advertising