నేడు కోటప్పకొండ తిరునాళ్లు
ABN, Publish Date - Mar 08 , 2024 | 03:33 AM
మహాశివరాత్రిని పురస్కరించుకుని పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలోని ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి తిరునాళ్లు శుక్రవారం కన్నుల పండువగా జరగనున్నాయి.
తరలి రానున్న లక్షలాది మంది భక్తులు
కోటప్పకొండ(నరసరావుపేట), మార్చి 7: మహాశివరాత్రిని పురస్కరించుకుని పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలోని ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి తిరునాళ్లు శుక్రవారం కన్నుల పండువగా జరగనున్నాయి. ఇందుకోసం కోటప్పకొండ ముస్తాబైంది. దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది యాత్రికులు తిరునాళ్ళకు తరలిరానున్నారు. యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం ఈ తిరునాళ్ళకు రాష్ట్ర పండుగ హోదా కల్పించిన నేపథ్యంలో ప్రభుత్వం తరుపున శ్రీ త్రికోటేశ్వర స్వామికి నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. ఇందు కోసం దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేసింది. తిరునాళ్లలో 3,000 మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ పట్టణాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు నిర్వహిస్తోంది. ఈ తిరునాళ్ళనే ప్రభల పండుగగా పిలుస్తారు.
Updated Date - Mar 08 , 2024 | 03:33 AM