ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

రానున్న ఎన్నికల్లో వైసీపీని తరిమికొట్టాలి

ABN, Publish Date - Mar 03 , 2024 | 11:50 PM

రాష్ట్రంలో అరాచక పాలన చేస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో తరిమికొట్టాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష కోరారు.

‘ఉద్దానప్రభంజనం’లో మాట్లాడుతున్న టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష

పలాసరూరల్‌, మార్చి3: రాష్ట్రంలో అరాచక పాలన చేస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో తరిమికొట్టాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష కోరారు. నీలావతి గ్రామంలో ఆదివారం టీడీపీ- జనసేన ఆధ్వర్యంలో ‘ఉద్దానం ప్రభంజనం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికలకు 45 రోజుల సమయం మాత్రమే ఉందని, అందువల్ల టీడీపీ-జనసేన నాయకులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రణాళికాబద్ధంగా పనిచేసి కూటమి విజయానికి పాటు పడాలని కోరారు. జనసేన జిల్లా నాయకులు పి.చంద్రమోహన్‌, దానేటి శ్రీధర్‌, నియోజకవర్గం సమన్వయకర్త దుర్గారావు మాట్లాడుతూ.. సార్వ త్రిక ఎన్నికల్లో కలిసికట్టుగా పని చేసి దుర్మార్గపు పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలన్నారు. అంతకు ముందు ఉద్దానానికి చెందిన పలు వురు టీడీపీలో చేరారు. ముందుగా టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో రామ కృష్ణాపురం నుంచి బైకు ర్యాలీతో సున్నాదేవి, రంగోయి, గురుదాసుపురం మీదుగా నీలావతి గ్రామానికి చేరుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ పలాస మండల అధ్యక్షుడు కుత్తుమ లక్ష్మణకుమార్‌, నాయకులు వజ్జ బాబూ రావు, పీరికట్ల విఠల్‌, దువ్వాడ హేమబాబుచౌదరి, టి.నర్సింహమూర్తి, కిక్క ర ఢిల్లీరావు, సంతోష్‌ కుమార్‌, జనసేన నాయకులు సంతోష్‌ పండా, కోత పూర్ణచంద్రరావు, పెద్ద ఎత్తున టీడీపీ, జనసేన కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

Updated Date - Mar 03 , 2024 | 11:50 PM

Advertising
Advertising