ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అరసవల్లిలో అంతరించిపోతున్న పచ్చదనం

ABN, Publish Date - Feb 22 , 2024 | 11:42 PM

అరసవల్లిలోని సూర్యనారాయణస్వామి ఆలయంలో వందేళ్లనాటి విశిష్టమైన వృక్షాలు అంతరించిపోతున్నాయి. అభివృద్ధి పేరుతో చెట్లను తొలగిస్తున్నారు. ఆలయ ప్రాంగణమంతా పచ్చదనానికి దూరమై.. వాయు కాలుష్యం పెరుగుతోంది.

నవగ్రహ మండపం వద్ద నరికేసిన రావి చెట్టు, రేకు షెడ్డు కోసం వేప చెట్టును ఇలా..

- అభివృద్ధి పేరుతో విశిష్టమైన చెట్ల తొలగింపు

- పెరుగుతున్న వాయుకాలుష్యం

- భక్తుల్లో విస్మయం

(శ్రీకాకుళం క్రైం)

అరసవల్లిలోని సూర్యనారాయణస్వామి ఆలయంలో వందేళ్లనాటి విశిష్టమైన వృక్షాలు అంతరించిపోతున్నాయి. అభివృద్ధి పేరుతో చెట్లను తొలగిస్తున్నారు. ఆలయ ప్రాంగణమంతా పచ్చదనానికి దూరమై.. వాయు కాలుష్యం పెరుగుతోంది. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని సాక్షాత్తు ఇంద్రుడు ప్రతిష్టించినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఆదిత్యుడ్ని దర్శిస్తే ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని భక్తుల నమ్మకం. ఈ నేపథ్యంలో ఆదిత్యుడి ఆలయానికి భక్తుల తాకిడి పెరుగుతూనే ఉంది. భక్తులకు సౌకర్యాలు కల్పించే దిశగా ఆలయంలో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఆలయంలో ఉన్న విశిష్టమైన, పురాతన వృక్షాలను అధికారులు తొలగిస్తున్నారు. ఒకప్పుడు ఆలయం ముందు విశిష్టమైన కదంబర వృక్షం, సంపంగి, నాగమల్లి, కోటిలింగాల వృక్షం, నూరువరహాల చెట్లు ఉండేవి. వాటి పుష్పాలతో ఆదిత్యుడికి నిత్య పూజలు, అలంకరణ చేసేవారు. శ్రీసూర్యనారాయణస్వామి అంతరాలయం వద్ద శక్తి రూపిణి దుర్గమ్మకు ప్రీతికరమైన కదంబర పుష్పాలను సమర్పించేవారు. అశ్విజ మాసంలో దుర్గమ్మకు నవరాత్రుల పూజలు చేయటం ఆనవాయితీ. ఈ పూజల్లో ప్రధానంగా కదంబర పుష్పాలతో అమ్మవారితోపాటు ఆలయానికి అధిష్టాన దేవునిగా ఉన్న భువనేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామిని అర్చించేవారు. ఈ వృక్షాలు, పుష్పాల ద్వారా పరిమళ సుగంధాలు వెదజల్లేవి. ఇంతటి ప్రాధాన్యమైన చెట్లను తొలగిస్తుండడంతో భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆలయంలో నవగ్రహాల మండపం వద్ద ఎన్నో ఏళ్ల నాటి రావి, వేప చెట్లను సైతం ఇటీవల సగానికి నరికివేశారు. వీటిని తొలగించాలంటే అటవీశాఖ అధికారుల అనుమతి తప్పనిసరి. కాగా ఆలయ అధికారులు నిబంధనలు పాటించకుండా చెట్లను తొలగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆలయ అధికారులు చెట్లను తొలగిస్తున్నారు కానీ, సువిశాల స్థలం ఉన్నా మొక్కలు నాటేందుకు మాత్రం ఆసక్తి చూపడం లేదని భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాయు కాలుష్యం పెరిగే ప్రమాదం ఉందని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆలయంలో ఉన్న వృక్షాలను తొలగించకుండా.. మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.

పచ్చదనాన్ని పెంపొందిస్తాం

నేను ఇటీవల బాధ్యతలు స్వీకరించాను. ఆలయం వద్ద ఉన్న ఇంద్ర పుష్కరిణి పనులు మరో మూడునెలలో పూర్తి చేస్తాం. వర్షాకాలంలో కోనేరు చుట్టూ నీడనిచ్చే వృక్షాలతో పాటు దేవతా వృక్షాలను కూడా ఏర్పాటు చేస్తాం. ఆలయానికి చెందిన తోటలోనూ, నవగ్రహాల మండపం వద్ద నక్షత్ర వనం, రాశి వనం మొక్కలను నాటుతాం. ఆలయంలో పూలనిచ్చే మొక్కలను పెంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పునరుద్ధరిస్తాం.

- డీఎల్‌వీ రమేష్‌, ఈవో, అరసవల్లి

Updated Date - Feb 22 , 2024 | 11:42 PM

Advertising
Advertising