ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

డ్వాక్రా మహిళలకు దువ్వాడ తాయిళాలు

ABN, Publish Date - Mar 08 , 2024 | 11:58 PM

మహిళా దినోత్సవం సందర్భంగా వైసీపీ నేత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ డ్వాక్రా మహిళలకు తాయిళాల రూపంలో చీరలు పంపిణీ చేశారు.

డ్వాక్రా మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్న దువ్వాడ శ్రీనివాస్‌

టెక్కలి, మార్చి 8 : మహిళా దినోత్సవం సందర్భంగా వైసీపీ నేత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ డ్వాక్రా మహిళలకు తాయిళాల రూపంలో చీరలు పంపిణీ చేశారు. శుక్రవారం టెక్కలిలోని తన కార్యాలయంలో నియోజకవర్గ మహిళా ప్రజాప్రతినిధుల సన్మానం పేరిట పనిలో పనిగా 500మంది డ్వాక్రా మహిళలను పిలిచారు. కవరుపైన ‘జై జగన్‌.. జై దువ్వాడ, ఫ్యాన్‌ గుర్తుకే మీ ఓటు’ అంటూ ఓ స్టిక్కర్‌ అతికించి వారికి చీరలు అందజేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీకి సహకరించాలని కోరడం చర్చనీయాంశమైంది. కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి పేడాడ తిలక్‌, వైసీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు చింతాడ మంజు, నందిగాం ఎంపీపీ నడుపూరు శ్రీరామ్మూర్తి, టెక్కలి సర్పంచ్‌ గొండేల సుజాత, కోత ఇందిర, రాజేశ్వరి ఉన్నారు.

Updated Date - Mar 08 , 2024 | 11:58 PM

Advertising
Advertising