ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

చల్లారని అసంతృప్తి జ్వాలలు

ABN, Publish Date - Mar 01 , 2024 | 11:50 PM

పాతపట్నం నియోజకవర్గంలో అసంతృప్తి జ్వాల లు చల్లారడం లేదు. తాత్కాలికంగానైనా వీటిని చల్లార్చేందుకు ఆ పార్టీ అధిష్ఠానం రంగం లోకి దిగింది. విజయనగరం జడ్పీ చైర్మన్‌, వైసీపీ ఏరియా డిప్యూటీ కోఆర్డినేటర్‌ మజ్జి శ్రీను శుక్రవారం పాతపట్నంలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి సమక్షంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహిం చారు.

పాతపట్నం నియోజకవర్గ సమావేశానికి వైసీపీ నేతల గైర్హాజరు

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి/పాతపట్నం: పాతపట్నం నియోజకవర్గంలో అసంతృప్తి జ్వాల లు చల్లారడం లేదు. తాత్కాలికంగానైనా వీటిని చల్లార్చేందుకు ఆ పార్టీ అధిష్ఠానం రంగం లోకి దిగింది. విజయనగరం జడ్పీ చైర్మన్‌, వైసీపీ ఏరియా డిప్యూటీ కోఆర్డినేటర్‌ మజ్జి శ్రీను శుక్రవారం పాతపట్నంలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి సమక్షంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహిం చారు. అసమ్మతి నాయకులను బుజ్జగించేందుకు ఈ సమావేశం నిర్వహించినా.. బహిరంగం గానే రెడ్డి శాంతి మాకొద్దు అని భీష్మించుకుని కూర్చున్న అనేక మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరుకాలేదు. కొత్తూరు మండల ఉపాధ్యక్షుడు తులసీవర ప్రసాద్‌, కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ మామిడి శ్రీకాంత్‌ వర్గం ఈ సమావేశానికి డుమ్మా కొట్టారు. అలాగే కొత్తూరు, హిరమండలం ఎంపీపీలు సవర సావిత్రి, తూలుగు మేనక, ఎల్‌ఎన్‌పేట, పాతపట్నం జడ్పీటీసీలు కిలారి త్రినాథరావు, లింగాల ఉషారాణి, మెళియాపుట్టి వైస్‌ ఎంపీపీ తులసీవరప్రసాద్‌ గైర్హాజరయ్యారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌, ఎమ్మెల్సీ విక్రాంత్‌, శ్రీకాకుళం పార్లమెంటరీ వైసీపీ ఇన్‌చార్జి తిలక్‌ పాల్గొన్నప్పటికీ స్థానిక వైసీపీ నేతలు ఎక్కువ మంది హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది. ఇక్కడ పార్టీ నేతల్లో ఏర్పడిన అశాంతిని చల్లార్చడమన్నది వైసీపీ నాయకులెవరితరం కాదన్న సంకేతాలు కనిపించినట్లు గుసగుసలు వినిపించాయి.

Updated Date - Mar 01 , 2024 | 11:50 PM

Advertising
Advertising