టీడీపీలో 60 కుటుంబాలు చేరిక
ABN, Publish Date - Mar 04 , 2024 | 12:11 AM
స్థానిక మున్సిపాలిటీలో గల డాబాల వారి వీధికి చెందిన వైసీపీ నాయకు లు నక్క గోపాలరావు, ఎరిపిల్లి గోపి ఆధ్వర్యంలో 60 యాదవ కుటుంబాలు ఆదివారం టీడీపీలో చేరాయి.
ఆమదాలవలస: స్థానిక మున్సిపాలిటీలో గల డాబాల వారి వీధికి చెందిన వైసీపీ నాయకు లు నక్క గోపాలరావు, ఎరిపిల్లి గోపి ఆధ్వర్యంలో 60 యాదవ కుటుంబాలు ఆదివారం టీడీపీలో చేరాయి. స్థానిక పా ర్టీ కార్యాలయంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ వారికి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. అలాగే మెట్టక్కివలస ప్రాంతానికి చెందిన వైసీపీ యువ నాయ కుడు అన్నెపు కృష్ణకాంత్ ఆధ్వర్యంలో 60 మంది యువకులు టీడీపీలో చేరారు. వీరందరికీ కండువాలు వేసి పార్టీలోకి కూన రవికుమార్ ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు తమ్మినేని విద్యాసాగర్, బోర గోవిందరావు, నాగల మురళీధర్, నూకరాజు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Mar 04 , 2024 | 12:11 AM