ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

శివరాత్రి వేడుకలకు శ్రీగిరి ముస్తాబు

ABN, Publish Date - Mar 08 , 2024 | 03:31 AM

మహాశివరాత్రి పర్వదినానికి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైల మహాక్షేత్రం ముస్తాబైంది. వివిధ రకాల పూలతో, విద్యుద్దీపాలతో ప్రధాన ఆలయాన్ని అలంకరించారు. శివరాత్రి సందర్భంగా స్వామి వారికి నిర్వహించే

స్వామివారికి ఘనంగా గజ వాహనసేవ.. నేడు పాగాలంకరణ, మల్లన్న కల్యాణం

శ్రీశైలం, మార్చి 7: మహాశివరాత్రి పర్వదినానికి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైల మహాక్షేత్రం ముస్తాబైంది. వివిధ రకాల పూలతో, విద్యుద్దీపాలతో ప్రధాన ఆలయాన్ని అలంకరించారు. శివరాత్రి సందర్భంగా స్వామి వారికి నిర్వహించే పూజా కార్యక్రమాలకు ప్రధాన పూజారులు సర్వం సిద్ధం చేశారు. శుక్రవారం రాత్రి 10 గంటలకు లింగోద్భవ మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పాగాలంకరణ, అనంతరం స్వామి వారికి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. భక్తుల రద్దీకి అనుగుణంగా దేవస్థాన అధికారులు ఏర్పాట్లు చేశారు. లింగోద్భవం, పాగాలంకరణ కార్యక్రమం సందర్భంగా దాదాపు పరిమిత సంఖ్యలో భక్తులను లోపలికి అనుమతించనున్నట్టు అధికారులు ముందుగా నే తెలిపారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భా గంగా గురువారం భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. శుక్రవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సాయంత్రం 5 గంటలకు ప్రభోత్సవం, రా త్రి 7 గంటలకు నందివాహన సేవ నిర్వహిస్తారు.

Updated Date - Mar 08 , 2024 | 03:32 AM

Advertising
Advertising