ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఇసుక భోజనం

ABN, Publish Date - Mar 03 , 2024 | 11:55 PM

అధికారం చేతిలో ఉంది.. నాయకుల అండదండలు పుష్కలంగా ఉన్నాయి.. అధికారులు, పోలీసులు కన్నెత్తి చూడరు.. ఇంకేముంది అధికార పార్టీ నాయకులు ఆడిందే ఆట.. పాడిందే పాట.. కాసుల కక్కుర్తితో యథేచ్ఛగా ఇసుకను మింగేస్తున్నారు.

సాతనూరు సమీపంలో తుంగభద్రనదిలో ఇసుక తరలింపుతో ఏర్పడ్డ గుంతలు

సాతనూరు సమీపంలో అధికార పార్టీ నేతల బరితెగింపు

పది రోజులుగా తుంగభద్రలో అక్రమ ఇసుక తరలింపు

పట్టించుకోని అధికారులు, పోలీసులు

కోసిగి, మార్చి 3: అధికారం చేతిలో ఉంది.. నాయకుల అండదండలు పుష్కలంగా ఉన్నాయి.. అధికారులు, పోలీసులు కన్నెత్తి చూడరు.. ఇంకేముంది అధికార పార్టీ నాయకులు ఆడిందే ఆట.. పాడిందే పాట.. కాసుల కక్కుర్తితో యథేచ్ఛగా ఇసుకను మింగేస్తున్నారు.

కోసిగి మండల పరిధిలోని సాతనూరు గ్రామ సమీపంలోని తుంగభద్ర నదిలో అధికార పార్టీ వైసీపీకి చెందిన నాయకులు తమ సొంత ట్రాక్టర్లలో రూ.లక్షలు విలువ చేసే ప్రకృతి సంపదను యథేచ్ఛగా తోడేస్తున్నారు. ఇసుక అక్రమంగా రవాణా చేస్తూ భూగర్బజలాలకు ముంపు తెస్తున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తూ లక్షల్లో జేబులు నింపుకుంటున్నారు. పోలీసులు, రెవెన్యూ, సెబ్‌, మైనింగ్‌ అధికారులు నామమాత్రపు చర్యలతోనే సరిపెడుతుండడంతో అధికార వైసీపీ నాయకులు మరింత రెచ్చిపోతున్నారని సాతనూరు గ్రామస్థులు మండిపడుతున్నారు. జంపాపురం గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు రవాణా కాంట్రాక్టరు అధికార పనులకు రోడ్లు, డ్రైనేజీ వంటి పనులకు తుంగభద్ర నది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నా అధికారులు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. అలాగే సాతనూరు, ఐరెంగల్‌ గ్రామాలకు చెందిన అధికార పార్టీ వైసీపీ నాయకులు సొంత ట్రాక్టర్లలో ఇసుకను పగలు, రాత్రి అనేతేడా లేకుండా తోడేస్తున్నారు. వారం రోజులుగా రాత్రి 7 గంటల నుంచి తెల్లవారుజాము వరకు అక్రమంగా ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తున్నారు.. ‘అధికారులకు సమాచారం ఇచ్చాం అయినా చర్యలు లేవు. తుంగభద్రను కాపాడేవారే లేరా’ అంటూ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. నదితీర గ్రామాల్లోని అధికార పార్టీ నాయకులు రాత్రయితే చాలు ట్రాక్టర్ల ద్వారా తుంగభద్ర నదిలో వాలిపోతున్నారు. ఒక ట్రాక్టరు ఇసుక రూ.3వేల నుంచి రూ.4వేల వరకు అక్రమంగా అమ్మకాలు సాగిస్తున్నారు. కనీసం రోజుకు వంద ట్రిప్పుల ఇసుకను తుంగభద్ర నది నుంచి తోడేస్తున్నా అధికారుల కిమ్మనకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ‘అరకొరగా అధికారులు తనిఖీలు చేస్తారు.. ట్రాక్టర్లు దొరికినప్పటికీ పైస్థాయి నాయకుల నుంచి ఫోన్లు వచ్చిన వెంటనే అక్కడే వదిలేసి వెళ్తున్నారు’ అంటూ గ్రామస్థులు వాపోయారు. తుంభద్రనదిలో నుంచి అక్రమంగా ఇసుకను తరలించడంతో భూగర్బజలాలకు ప్రమాదం వస్తోందని నది పరివాహక ప్రాంతాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘తుంగభద్ర నదిని నమ్ముకొని సాగుచేస్తున్నాం.. ఈ ఇసుకాసురుల వల్ల ఇప్పుడు భూగర్భజలాలు అడుగంటిపోయే ప్రమాదం ఏర్పడింది’ అంటూ రైతులు లబోదిబోమంటున్నారు.

Updated Date - Mar 03 , 2024 | 11:55 PM

Advertising
Advertising