ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

రాచమల్లు అరాచకం!

ABN, Publish Date - Mar 06 , 2024 | 04:05 AM

ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఓ బాలుడిపై పైశాచికంగా ప్రవర్తించారు.

‘ఆంధ్రజ్యోతి’పై అక్కసు.. బాలుడికి హింస

దుస్తులు ఊడదీయించి పైశాచికత్వం

ఎమ్మెల్యే వైఖరిపై హక్కుల సంఘాల ఆగ్రహం

సుమోటోగా కేసు నమోదుకు డిమాండ్‌

ప్రొద్దుటూరు, మార్చి5: ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఓ బాలుడిపై పైశాచికంగా ప్రవర్తించారు. మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికలో వచ్చిన ‘అరాచకమల్లు’ కఽథనంపై తన అసహనం ప్రదర్శించేందుకు నాలుగేళ్ల బాలుడిని ఉపయోగించుకున్నారు. ఆ బాలుడి దుస్తులు ఊడదీయమని అనుచరులను ఉసిగొల్పి.. ఏడుస్తున్నా.. ‘ఆ పేపర్‌తో పిల్లవాడి గు.. తుడవండి, ము.. తుడవండ’ని అసభ్య పదజాలంతో మాట్లాడారు. ఈ వీడియోను కొన్ని యూట్యూబ్‌ చానల్స్‌లో ప్రసారం చేయగా మానవ హక్కుల కౌన్సిల్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి కరుణాకర్‌ చూశారు. దీనిపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్టు ఆయన తెలిపారు. ప్రజా ప్రతినిధిగా ఉండీ బాలుడిపట్ల బహిరంగ ప్రదేశంలో అసభ్యకరంగా వ్యవహరించడం, దాన్ని ప్రోత్సహించటంపై సుమోటోగా బాలల పరిరక్షణ చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఇలాంటివి ప్రసారంచేసే యూట్యూబ్‌ చానల్స్‌పై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. రాజకీయ విమర్శలకు పిల్లలను, మహిళలను కించపరచకూడదని, అవమానపరిచేలా వ్యవహరించకూడదని చట్టంలో ఉన్నా వాటిని రాజకీయ నాయకులు ఇటీవల తరచూ ఉల్లంఘిస్తున్నారని అన్నారు. దీనిపై మానవ హక్కుల కమిషన్‌, హైకోర్టు నేరుగా జోక్యం చేసుకోవాలని కోరారు.

Updated Date - Mar 06 , 2024 | 04:05 AM

Advertising
Advertising