ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వైభవంగా రాములవారి విగ్రహ ప్రతిష్ఠ

ABN, Publish Date - Mar 01 , 2024 | 12:13 AM

పట్టణంలోని ఓబుల శెట్టివారి వీధిలో సీతారామ లక్ష్మణ, హనుమత్‌ సమేత శీపట్టాభిరామస్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు.

పొదిలి, ఫిబ్రవరి 29 : పట్టణంలోని ఓబుల శెట్టివారి వీధిలో సీతారామ లక్ష్మణ, హనుమత్‌ సమేత శీపట్టాభిరామస్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు. వైఖానస ఆగమ పండితులు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించా రు. స్వామివారికి ముందుగా విష్వక్సేనపూజ, పుణ్యాహవాచనం, వాస్తుహోమం పూజ, పీఠారో హణం, సప్తధాతు నవరత్న నవఽధాన్య పూజలు నిర్వహించి యంత్ర ప్రతిష్ట విగ్రహప్రతిష్ట చేశా రు. అనంతరం అంగరంగ వైభవంగా సీతారామ కల్యాణం నిర్వహించారు. భక్తులకు దర్శనం కల్పించారు. రాత్రికి గ్రామోత్సవం నిర్వహిం చారు. అనంతరం అన్నదానం చేశారు.

సర్వభూపాలుడిగా వేణుగోపాలుడు

తర్లుపాడు : తర్లుపాడులో వెలసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా గురువారం గజ వాహనంపై మువ్వగోపాలుడు సర్వభూపాలుడి అలంకరణలో వేణుగోపా లుడు భక్తులకు దర్శన మిచ్చారు. ఆలయ ప్రధానార్చకులు కారంపూడి వెంకటరమణా చార్యులు, భార్గవ రామాచార్యు లు, కూనపులి రమణయ్యశర్మల ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక అలంకరణ కార్యక్రమం ని ర్వహించారు. స్వామి వారిని తర్లుపాడు పురవీ ధుల్లో మేళతాళాలతో, డప్పు వాయిద్యాల నడు మ అంగరంగ వైభవంగా గ్రామోత్సవం నిర్వ హించారు. భక్తులు జై వేణుగోపాల స్వామి అంటూ భజనలు చేశారు. భక్తులు వార్లుపోసి కాయాకర్పూరాలు సమర్పించారు. పలువురు దంపతులు ఉభయదాతలుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ ఈదుల చెన్నకేశవ రెడ్డి, ఆలయ అనువంశిక ధర్మకర్త జవాజి విజయభాస్కర్‌రావు, వివిధ వాహనాల ఉభయ దాతలు కశ్శెట్టి జగన్‌బాబు, జవాజి సత్య నారాయణ, వాడేల కృష్ణప్రసాద్‌, భక్తులు తది తరులు పాల్గొన్నారు.

నేడు రథోత్సవం

తర్లుపాడు : తర్లుపాడులో వెలసిన శ్రీరుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి బ్రహ్మో త్సవాల సందర్భంగా శుక్రవారం సాయంత్రం 4 గంటలకు రథోత్సవం నిర్వహించనున్నట్లు ఆల య ఈవో ఈదుల చెన్నకేశవరెడ్డి తెలిపారు. రథోత్సవ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకుని తీర్థప్ర సాదాలు స్వీకరించాలని ఆయన కోరారు.

రథం మరమ్మతు పనులు ప్రారంభం

పొదిలి, : మహాశివరాత్రి పర్వదినోత్సవం సందర్భంగా పార్వతీసమేత నిర్మామహేశ్వర స్వామి వారిని పురవీధుల్లో ఊరేగించేందుకు నిర్మించిన రథం మరమ్మత్తులు గురువారం ప్రారంభించారు. ధర్యకర్త యక్కలి శేషగిరి, రథనిర్మాణ దాత సామంతపూడి నాగేశ్వరరావు, అన్నా కృష్ణచైతన్య తదితరులు కొబ్బరికాయలు కొట్టి పనులు ప్రారంభించారు.

Updated Date - Mar 01 , 2024 | 12:13 AM

Advertising
Advertising