చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రానికి భవిష్యత్
ABN, Publish Date - Mar 03 , 2024 | 10:24 PM
వైసీపీ పాలనలో రాష్ట్ర భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారిందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎంఎం కొండయ్య ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే ఎ న్నికల్లో టీడీపీ, జనసేన కూటమి అభ్యర్ధులను గెలిపించుకుని చంద్రబాబును తిరిగి ముఖ్యమంత్రిని చేసుకుంటేనే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు.
చీరాల, మార్చి 3: వైసీపీ పాలనలో రాష్ట్ర భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారిందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎంఎం కొండయ్య ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే ఎ న్నికల్లో టీడీపీ, జనసేన కూటమి అభ్యర్ధులను గెలిపించుకుని చంద్రబాబును తిరిగి ముఖ్యమంత్రిని చేసుకుంటేనే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. మండలంలోని రామకృష్ణాపురంలో ఆదివారం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి బాబు ష్యూరిటీ, భవిష్యత్ గ్యారంటీ, సూపర్ సిక్స్ మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా కొండయ్య మాట్లాడుతూ విజన్ ఉన్న నాయకుడు చంద్ర బాబు అని అన్నారు. అలాంటి నాయకత్వం ప్రస్తుతం రాష్ట్రానికి అవసరమన్నారు. అన్నివర్గాలు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నాయన్నారు. రాష్ట్ర సచివాలయాన్ని తా కట్టు పెట్టి రూ.370 కోట్లు అప్పు తేవటం సీఎం జగన్ వికృత పాలనకు పరాకాష్టని మండిపడ్టారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు నాతాని ఉమామహేశ్వర రావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈనెల 5న మంగళగిరిలో జరగనున్న జయహో బీసీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కొండయ్య పిలుపునిచ్చారు. స్థానిక పార్టీ కార్యాలయంలో జయహో బీసీ సభ విజయవంతం కోసం పార్టీ శ్రేణులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో బీసీ నాయకులు కౌతవరపు జనార్దనరావు, నాసిక వీరభద్రయ్య, కావేటి వేణుగోపాల్, గుత్తి వీరప్రసాదరావు, అవ్వారు సాంబయ్య, కారంపూడి పద్మిని, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Mar 03 , 2024 | 10:24 PM