పది రోజుల తర్వాతే లోకేష్ పర్యటన
ABN, Publish Date - Mar 03 , 2024 | 11:40 PM
జిల్లాలోని ఆయా నియోజకవర్గాల టీడీపీ నేతలు వ్య క్తం చేసిన అభిప్రాయాలకు అనుగుణంగా ఆ పార్టీ జా తీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ జిల్లా పర్యటన వాయి దా పడింది. ఈనెల 7వ తేదీ నుంచే ఆయన జిల్లాలో శంఖారావం కార్యక్రమం ప్రారంభించాలనుకున్న విష యం విదితమే.
చంద్రబాబు కార్యక్రమం కూడా వాయిదా పడే అవకాశం
ఆంధ్రజ్యోతి, ఒంగోలు
జిల్లాలోని ఆయా నియోజకవర్గాల టీడీపీ నేతలు వ్య క్తం చేసిన అభిప్రాయాలకు అనుగుణంగా ఆ పార్టీ జా తీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ జిల్లా పర్యటన వాయి దా పడింది. ఈనెల 7వ తేదీ నుంచే ఆయన జిల్లాలో శంఖారావం కార్యక్రమం ప్రారంభించాలనుకున్న విష యం విదితమే. అయితే 8వ తేదీ శివరాత్రి కావడంతో పదో తేదీ తర్వాత జిల్లాకు రావాలని టీడీపీ నేతలు సూచించారు. దీంతో జిల్లాలో 7వ తేదీ నుంచి పర్యటించాలనుకున్న తన పర్యటనను లోకేష్ మార్చుకున్నారు. రాయలసీమ నుంచి శంఖారావంను ప్రారంభించి ఆ వరుస క్రమంలో జిల్లాకు వస్తారని సమాచారం. దీంతో లోకేష్ శంఖారావం సభలు జిల్లాలో పది రోజుల తర్వాతే జరిగే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఈనెల 10వ తేదీన మార్కాపురం లో నిర్వహించాల్సిన చంద్రబాబు సభ కూడా వాయిదా పడే అవకాశం ఉంది. ఒంగోలు ఎంపీమాగుంట, అయన కుమారుడు, ఇతర అనుచరులు పార్టీలో చేరేందుకు చంద్రబాబును జిల్లాకు రావాలని మాగుంట ఆహ్వానించారు. అయితే అందుకు తేదీ ఖరారు కాకపోవడంతో మార్కాపుం కార్యక్రమం కూడా పదో తేదీ కాకుండా ఆ తర్వాత నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిసింది.
Updated Date - Mar 03 , 2024 | 11:40 PM