టీడీపీ విజయానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలి
ABN, Publish Date - Mar 03 , 2024 | 12:29 AM
రానున్న సార్వత్రిక ఎన్నిక ల్లో టీడీపీ విజయానికి ప్రతిఒక్కరూ శక్తివంచన లేకుండా కృషి చేయాలని మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి కోరారు.
పొదిలి, మార్చి 2 : రానున్న సార్వత్రిక ఎన్నిక ల్లో టీడీపీ విజయానికి ప్రతిఒక్కరూ శక్తివంచన లేకుండా కృషి చేయాలని మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి కోరారు. శనివారం మండలంలోని అన్నవరం, గోగనేని వారిపాలెం. ఉప్పలపాడు గ్రామాల్లో పర్యటిం చారు. అనంతరం బూత్‌కమిటీలతోపాటు అన్ని వర్గాల వారితో సమావేశమై మాట్లాడారు.రాష్ట్రం మొత్తం చంద్రబాబు పాలనకోసం ఎదురు చూస్తున్నారన్నారు. రాష్ట్రం తిరిగి అభివృద్ది పధంలో నడిపించే శక్తి, సామర్ధ్యం ఉన్న వ్యక్తి చంద్రబాబునాయుడేనన్నారు. వైసీపీ ఐదేళ్లలో దోపిడి కొనసాగిందన్నారు. జగన్‌రెడ్డి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు. వెలిగొండ ప్రాజెక్ట్‌పై పూటకో మాటమాట్లాడుతన్నారని ఎద్దేవ చేశారు. 2024లో టీడీపీ విజయఢంకా మోగిస్తుందని చంద్రబాబునాయుడు తిరిగి ముఖ్యమంత్రి అవుతారన్నారు. వెలుగొండ పూర్తి చేయడంతో పాటు మార్కాపురం ప్రత్యేక జిల్లా చేయడం ఖాయమన్నారు. వెలుగొండ ప్రాజెక్ట్‌పై మాట తప్పిన ముఖ్యమంత్రిని ప్రజలు విశ్వసించ రన్నారు. చంద్రబాబుపై ప్రజలు, యువత నమ్మకంతో ఉన్నారన్నారు. అమరావతిని రాజధా నిగా ఏర్పాటు చేసిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. చంద్రబాబునాయుడిని తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. కార్యక్రమంలో గ్రామ బూత్‌కమిటీ సభ్యులు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - Mar 03 , 2024 | 12:29 AM