ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

టీడీపీతోనే అభివృద్ధి సాధ్యం

ABN, Publish Date - Mar 03 , 2024 | 12:31 AM

రాష్ట్రంలో టీడీపీతోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని బేస్తవారపేట మండల టీడీపీ అధ్యక్షులు సోరెడ్డి మోహన్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు పూనూరు భూపాల్‌రెడ్డి, చెట్టిచెర్ల మాజీ సర్పంచ్‌ తిగిరెడ్డి భూపాల్‌రెడ్డిలు పేర్కొన్నారు.

బేస్తవారపేట, మార్చి 2 : రాష్ట్రంలో టీడీపీతోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని బేస్తవారపేట మండల టీడీపీ అధ్యక్షులు సోరెడ్డి మోహన్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు పూనూరు భూపాల్‌రెడ్డి, చెట్టిచెర్ల మాజీ సర్పంచ్‌ తిగిరెడ్డి భూపాల్‌రెడ్డిలు పేర్కొన్నారు. ‘బాబు ష్యూరిటీ, భవిష్యత్‌కు గ్యారెంటీ’ కార్యక్రమంలో భాగంగా శనివారం బేస్తవారపేట మండలంలోని ఖాజిపురం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఇంటింటికి తిరిగి టీడీ పీ జనసేన ఉమ్మడిగా ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలోని అంశాలను మహిళలకు, ప్రజలకు వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతులకు సంక్షేమం అందిస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి అభివృద్ధి చేయలేదన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి, పూనూరు జగన్మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే బేస్తవారపేట పట్టణంలో జరిగిన కార్యక్రమంలో మాజి సర్పంచ్‌ గాజుల విశ్వనాథం, మూప్పూరి రాము, దూదెకుల సైదులు, దూదెకుల ఆదాం తదితరులు పాల్గొని ఇంటింటికి తిరిగి టీడీపీ అభివృద్ధిపై ప్రజలకు వివరించారు.

గిద్దలూరు టౌన్‌ : ఈ నెల 7న గురువారం గిద్దలూరులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ శంఖారావం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ముత్తుముల అశోక్‌రెడ్డి తెలిపారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు శంఖా రావం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పట్టణంలోని ఒంగోలు రోడ్డు హెచ్‌పీ పెట్రోల్‌బంకు సమీపంలో నిర్వహిస్తున్న సభాప్రాంగణ ఏర్పాట్లను అశోక్‌రెడ్డి టీడీపీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ క్లస్టర్‌, యూనిట్‌, బూత్‌, కుటుంబ సాధికార సారధులు, ముఖ్య నాయకులతో లోకేష్‌ సమావేశం కానున్నారన్నారు. అంతేకాక సభకు గిద్దలూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి టీడీపీ శ్రేణులు తరలిరావాలని పిలుపు నిచ్చారు. ఆయనతోపాటు జడ్పీటీసీ సభ్యుడు బుడత మధుసూదన్‌, టీడీపీ మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి, షేక్‌ షహన్షావలి, టీడీపీ నాయ కులు దుత్తా బాలీశ్వరయ్య, ఓబులరెడ్డి, పెద్దభాషా, బిల్లారమేష్‌, మహనందియాదవ్‌, నంది శ్రీను, శేషగిరి, పందిళ్ళపల్లి శ్రీను, గోపాలక్రిష్ణ,ఉన్నారు.

గిద్దలూరు టౌన్‌, మార్చి 2 : నియోజకవర్గంలో వందల కోట్ల నిధులు తెచ్చి అభివృద్ది చేసిన ఘనత అశోక్‌రెడ్డిదేని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. ఇంటింటికి సూపర్‌ సిక్స్‌లో భాగంగా శనివారం గిద్దలూరు మండలం గడికోట గ్రామంలో సూపర్‌సిక్స్‌ సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. రానున్న ఎన్నికల్లో గిద్దలూరులో టీడీపీ, జనసేనల ఉమ్మడి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ముత్తుముల అశోక్‌రెడ్డి సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మడల పార్టీ అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి, గడికోట, ఉయ్యాలవాడ మాజీ సర్పంచ్‌లు రామసుబ్బయ్య, బోదనబోయిన గోపాలక్రిష్ణయాదవ్‌, కొమ్మునూరు సర్పంచ్‌ రామసుబ్బారెడ్డి, రంగస్వామి, వెంకటసుబ్బయ్య, మండల ఎస్సీసెల్‌ నాయకులు విజయరాజ్‌, టీడీపీ యూత్‌ నాయకులు అరున్‌యాదవ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 03 , 2024 | 12:31 AM

Advertising
Advertising