ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సింగరాయకొండలో మారనున్న సమీకరణలు

ABN, Publish Date - Feb 16 , 2024 | 11:57 PM

సింగరాయకొండ, రాజకీయ సమీకరణలు మారనున్నాయి. వైసీపీ కీలక నేత, గత కొంతకాలంగా ఆపార్టీకి దూరంగా ఉంటున్న దొడ్డా కరుణాకర్‌రెడ్డితో ఆయన నివాసంలో శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే స్వామి సమావేశమయ్యారు. దొడ్డాతోపాటు కుమారుడైన యువనేత మహీధర్‌రెడ్డి, వారి అనుచరులను తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు.

దొడ్డా కరుణాకర్‌రెడ్డి, వారి అనుచరులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే స్వామి

దొడ్డా, ఆయన అనుచరులను టీడీపీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే స్వామి

సానుకూలంగా స్పందించిన కరుణాకర్‌రెడ్డి

సింగరాయకొండ, ఫిబ్రవరి 16 : మండలంలో రాజకీయ సమీకరణలు మారనున్నాయి. వైసీపీ కీలక నేత, గత కొంతకాలంగా ఆపార్టీకి దూరంగా ఉంటున్న దొడ్డా కరుణాకర్‌రెడ్డితో ఆయన నివాసంలో శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే స్వామి సమావేశమయ్యారు. దొడ్డాతోపాటు కుమారుడైన యువనేత మహీధర్‌రెడ్డి, వారి అనుచరులను తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో వారు కూడా టీడీపీలో చేరేందుకు సానుకూలత వ్యక్తం చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సీనియర్‌ శాసనసభ్యుడు, మాజీ మంత్రి మహీధర్‌రెడ్డికి ముఖ్యఅనుచరుడైన కరుణాకర్‌రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమైంది. దీంతో స్థానికంగా అధికార పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి అయిన మంత్రి సురేష్‌ కీలకనాయకులతో మాట్లాడించి కరుణాకర్‌రెడ్డి పార్టీలోనే ఉండేలా ప్రయత్నించి విఫలమయ్యారని తెలుస్తోంది. వైసీపీలో కష్టపడి పనిచేసిన వారికి కాకుండా ఓట్లు లేని నాయకులకు పెద్దపీట వేస్తున్నారని, వారిచేతే ఎన్నికల్లో పనిచేయించుకోవాలని సురే్‌షకు తన అభిప్రాయాన్ని కరుణాకర్‌రెడ్డి చెప్పి పంపినట్లు సమాచారం. నియోజకవర్గంలో పార్టీల గెలుపోటములను ప్రభావితం చేసే సింగరాయకొండ మండలంలో చోటుచేసుకుంటున్న ప్రస్తుత పరిణామాలను పరిశీలిస్తే మున్ముందు రాజకీయ సమీకరణల్లో భారీ మార్పులు ఖాయమని తేలిపోతోంది. వైసీపీ నుంచి టీడీపీలోకి కొనసాగుతున్న వలసలపర్వం మరింత జోరందుకొంటుందన్న చర్చ నడుస్తోంది.

Updated Date - Feb 16 , 2024 | 11:58 PM

Advertising
Advertising