ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections: వైపీపీకి మరో భారీ షాక్.. ఆ కీలక నేత రాజీనామా

ABN, Publish Date - Feb 27 , 2024 | 06:00 PM

ఏపీలో ఎన్నికలు (AP Elections) సమీపిస్తున్నకొద్దీ అధికార పార్టీ వైసీపీకి (YCP) వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే కొందరు నేతలు ఆ పార్టీని వీడి.. ప్రతిపక్ష టీడీపీ (TDP), జనసేన (Janasena) పార్టీల్లోకి చేరారు. ఇప్పుడు తాజాగా వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది.

ఏపీలో ఎన్నికలు (AP Elections) సమీపిస్తున్నకొద్దీ అధికార పార్టీ వైసీపీకి (YCP) వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే కొందరు నేతలు ఆ పార్టీని వీడి.. ప్రతిపక్ష టీడీపీ (TDP), జనసేన (Janasena) పార్టీల్లోకి చేరారు. ఇప్పుడు తాజాగా వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. నెల్లూరు రూరల్‌లో ముఖ్య నేత అయిన కోడూరు కమలాకర్ రెడ్డి (Koduru Kamalakar Reddy) ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (Kotamreddy Sridhar Reddy) సమక్షంలో టీడీపీలోకి చేరారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అవమానించి, పార్టీ నుంచి వెళ్లగొట్టిన తీరు తనని బాధించిందని కమలాకర్ తెలిపారు. వైసీపీకి తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు.

అనంతరం కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ.. రెండో రోజుల్లోనే వైసీపీలోని ముఖ్యనేత టీడీపీలోకి చేరబోతున్నారని అన్నారు. నెల్లూరు రూరల్‌లో టీడీపీకి అతిపెద్ద మెజార్టీ రాబోతోందని పేర్కొన్నారు. జిల్లా రాజకీయాల్లో 30 ఏళ్లుగా కోడూరు కమలాకర్ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. మార్చి 2వ తేదీన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సమక్షంలో వీపీఆర్‌తో కలిసి కమలాకర్ తమ తెలుగుదేశం పార్టీలోకి చేరుతారని స్పష్టం చేశారు. రూరల్‌లో పెద్ద ఎత్తున టీడీపీలో చేరుతున్నాయని.. వచ్చే నెలలోనూ ఇంకా పెద్దఎత్తున చేరికలు ఉండబోతున్నాయని జోస్యం చెప్పారు. ఈసారి టీడీపీ అఖండ విజయం సాధించడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - Feb 27 , 2024 | 06:00 PM

Advertising
Advertising