ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

జగన్‌లాంటి అబద్ధాలకోరును చూడలేదు: అచ్చెన్న

ABN, Publish Date - Mar 01 , 2024 | 03:19 AM

ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి లాంటి అబద్ధాల కోరును చూడలేదంటూ రాష్ట్రంలోని ఐదుకోట్ల మంది ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి

నందిగాం, ఫిబ్రవరి 29: ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి లాంటి అబద్ధాల కోరును చూడలేదంటూ రాష్ట్రంలోని ఐదుకోట్ల మంది ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. గురువారం శ్రీకాకుళ జిల్లా నందిగాం మండలం పెద్దబాణాపురంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సంపద పెంచి, సృష్టించి పంచినప్పుడే నిజమైన నాయకుడు అవుతారన్నారు. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి రాష్ట్రాన్ని అప్పులపాల్జేసి.. తన రాజకీయ లబ్ధి కోసం కొందరికి మాత్రమే బటన్‌ నొక్కుతున్నారన్నారు. ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు లేవు, స్వయం ఉపాధి వంటివి లేక వ్యవస్థలు కుంటుపడ్డాయని, దీంతో ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని ఎదురుచూస్తున్నారని చెప్పారు. దుర్మార్గంగా ఉన్న వైసీపీ పాలనను బంగాళాఖాతంలో కలపాలని పిలుపునిచ్చారు. టీడీపీ, జనసేన సమర్థులైన అభ్యర్థులను ఎంపిక చేస్తుంటే.. జగన్‌ మాత్రం ప్రతిపక్షనేతల్ని తిట్టిన వారికి ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ నాయకులు వలంటీర్లు, పోలీసులు వ్యవస్థలు లేకుండా గ్రామాల్లో మాట్లాడగలరా అని ప్రశ్నించారు. జనసేన, టీడీపీ పొత్తును చెడగొట్టాలని ప్రయత్నించి విఫలమైన వైసీపీ నేతలు.. ఇప్పుడు తమకు ఓటమి తప్పదని వణికిపోతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీ రామ్మోహన్‌ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 01 , 2024 | 08:46 AM

Advertising
Advertising