ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మంత్రి ఉషకు సొంతపార్టీలోనే సెగ

ABN, Publish Date - Feb 04 , 2024 | 02:45 AM

ఎన్నికల బదిలీ’పై పెనుకొండ నియోజకవర్గానికి వెళ్లిన మంత్రి ఉష శ్రీచరణ్‌కు సొంతపార్టీవారే చుక్కలు చూపిస్తున్నారు.

సోమందేపల్లి మండలంలో ఫ్లెక్సీల చించివేత

చిత్రీకరిస్తున్న ‘ఆంధ్రజ్యోతి’పై గన్‌మన్లను ఉసిగొల్పిన మంత్రి

పెనుకొండ టౌన్‌, ఫిబ్రవరి 8: ‘ఎన్నికల బదిలీ’పై పెనుకొండ నియోజకవర్గానికి వెళ్లిన మంత్రి ఉష శ్రీచరణ్‌కు సొంతపార్టీవారే చుక్కలు చూపిస్తున్నారు. ఒకరి వద్దకు వెళితే మరొకరు అలుగుతున్నారు. ఓ గ్రామ పంచాయతీలో నాయకులు ‘మేం కావాలా..? వారు కావాలా..?’ అని పేచీకి దిగడంతో మంత్రి గంటపాటు నడిరోడ్డుపై కాన్వాయ్‌ను నిలుపుకొని తంటాలు పడాల్సి వచ్చింది. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని సోమందేపల్లి మండలం చాలకూరు పంచాయతీలో సోమవారం ఆమె పర్యటించారు. చాలకూరులో భోజన విరామం అనంతరం అసమ్మతి నాయకురాలు అశ్వర్థమ్మ ఇంటికి మంత్రి బయలుదేరారు. దీనికి నిరసనగా మంత్రి వాహనం నుంచి సర్పంచ్‌ భర్త లక్ష్మీనరసప్ప మధ్యలోనే దిగిపోయారు. తమను కాదని, వ్యతిరేకుల వద్దకు మంత్రి వెళ్లడంతో సర్పంచ్‌ లలితమ్మ, ఆమె భర్త లక్ష్మీనరసప్ప, వారి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రికి స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించివేశారు. దీంతో కంగుతిన్న మంత్రి.. సుమారు గంటపాటు చాలకూరు సమీపంలోని రోడ్డుపై తన వాహనంలోనే ఉండి మంతనాలు జరిపినా వారు వినలేదు. చేసేది లేక అక్కడి నుంచి మరో పంచాయతీకి వెళ్లారు. మంత్రి పర్యటనలో వివాదాలను చిత్రీకరిస్తున్న ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌ విలేకరిపై మంత్రి తన గన్‌మన్‌ను ఉసిగొల్పారు. విలేకరి సెల్‌ఫోన్‌ను గన్‌మెన్‌ లాక్కుని, వీడియోలు డిలీట్‌ చేసే ప్రయత్నం చేశారు. మంత్రి పర్యటన దృశ్యాలను చిత్రీకరించడం తమ విధిలో భాగమని, ఇలా వ్యవహరించడం తగదని తోటి విలేకరులు అభ్యంతరం చెప్పడంతో వెనక్కి తగ్గారు.

Updated Date - Feb 04 , 2024 | 07:53 AM

Advertising
Advertising