ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలి

ABN, Publish Date - Mar 03 , 2024 | 12:08 AM

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు సీపీఎ్‌సను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు.

నంద్యాల (నూనెపల్లె), మార్చి 2: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు సీపీఎ్‌సను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. శనివారం నంద్యాలలోని యూటీఎఫ్‌ జిల్లా కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల ప్రాంతీయ సమావేశం జరిగింది. వెంకటేశ్వర్లు హాజరై మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. అధికారం కోసమే వైసీపీ ప్రభుత్వం చేతకాని హామీలను గుప్పించి ఓట్లు దండుకొని నిలువునా మోసం చేశారని ధ్వజమెత్తారు. విద్య, ఉపాధ్యాయ రంగ సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం కాల క్షేపం చేస్తుందని అన్నారు. వెంటనే న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర సహ అద్యక్షుడు సురేష్‌, జిల్లా అధ్యక్షుడు ప్రసాద్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్‌, కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Mar 03 , 2024 | 12:08 AM

Advertising
Advertising