ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

పోలియో రహిత సమాజమే ధ్యేయం

ABN, Publish Date - Mar 04 , 2024 | 12:30 AM

పోలియో రహిత సమాజమే ధ్యేయం

పిల్లలకు పోలియో చుక్కలు వేసిన కలెక్టర్‌ డా.జి. సృజన

కర్నూలు(హాస్పిటల్‌), మార్చి 3: పోలియో రహిత సమాజమే.. మన ధ్యేయం కావాలని కర్నూలు కలెక్టర్‌ డా.జి. సృజన అన్నారు. ఆదివారం నగరంలో ని ఎ.క్యాంపులోని ఇందిరాగాంధీ స్మారక నగర పాలక ఉన్నత పాఠశాలలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా ఇమ్యూనైజేషన్‌ శాఖ ఏర్పాటు చేసిన పల్స్‌ పోలియో కేంద్రంలో కలెక్టర్‌ డా.జి. సృజన ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు వేసి చిన్నారుల భవిష్యత్తుకు బంగారుబాటలు వేద్దామని పేర్కొన్నారు. ఐదేళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని అన్నారు. అది మనందరి బాధ్యత అని అన్నారు. కార్యక్రమంలో పల్స్‌పోలియో స్టేట్‌ నోడల్‌ ఆఫీసర్‌ రవీంద్రారెద్డి, డీఎంహెచ్‌వో డా.బి. రామగిడ్డయ్య, డీఈవో సామూయేల్‌, డీఐవో ప్రవీణ్‌ కుమార్‌, ఎస్‌వో హేమసుందరం, అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ వైద్యాధికారి మాధవి, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 04 , 2024 | 12:30 AM

Advertising
Advertising