చికిత్స పొందుతూ యువకుడి మృతి
ABN, Publish Date - Mar 03 , 2024 | 12:07 AM
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకు డు నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
నంద్యాల క్రైం, మార్చి 2: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకు డు నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. నంద్యాల పట్టణంలోని ఇస్లాంపేటలో నివాసం ఉంటున్న అలిబాషా ఇంట్లో పక్కింటికి చె ందినవారు మీ ఇంట్లో మూడు అడుగుల స్థలం తమదని తరచూ బెదిరించేవారని, వారి వేధింపులు తాళలేక గత బుధవారం ఇంట్లో ఉన్న ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే అలిబాషను చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే కోలుకోలేక మృతిచెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మూడో పట్టణ పోలీసులు తెలిపారు.
Updated Date - Mar 03 , 2024 | 12:07 AM